ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు ఇవే..!!

కరోనా అన్ని రంగాలను దెబ్బ తీస్తే ఓటీటీకి మాత్రం కాసులపంట కురిపించింది. కరోనా దెబ్బతో థియేటర్ల మూతపడటంతో ఓటీటీని సినిమాలు ఆశ్రయిస్తున్నాయి. పాండమిక్ సమయంలో జనాలు ఓటీటీలకు అతుక్కుపోయారు. అందుకే సినిమాలు, సిరీస్ లు చూసుకుంటూ కాలక్షేపం చేశారు.

లాక్ డౌన్ నేపథ్యంలో జనాలు ఇంటి వద్దనే ఉంటున్నారు కాబట్టి ఓటీటీకి మంచి గిరాకే లభిస్తోంది. కొత్త సినిమాలను కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు నేరుగా రిలీజవుతుంటే.. థియేటర్‌‌‌‌లో రిలీజైన కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్‌‌కి వస్తున్నాయి. అప్పటికే థియేటర్లలో రిలీజై అంతంత మాత్రమే ఆడిన సినిమాలు ఓటీటీ బాట పట్టి అక్కడ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం విశేషం. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందుకే ఈ వారం ఓటీటీ దగ్గర సినిమాల సందడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీలో సంచలనాలు సృష్టించగా ఈ శుక్రవారం మరిన్ని కొత్త సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరి ఈ వీక్ రిలీజ్ అయిన, కాబోయే లిస్టులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో లుక్కేద్దాం పదండి.!

► ఈవిల్‌ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ (వూట్‌, జూన్‌ 20)
► ఇన్‌ ద డార్క్‌ సీజన్‌ 3 వెబ్‌ సిరీస్‌ (వూట్‌, జూన్‌ 23)
► గుడ్‌ ఆన్‌ పేపర్‌ (నెట్‌ఫ్లిక్స్‌, జూన్‌ 23)
► ద హౌస్‌ ఆఫ్‌ ఫ్లవర్స్‌: ద మూవీ
► సమంత్ర సీజన్‌ 2 (ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌, జూన్‌ 24)
►రే (నెట్‌ఫ్లిక్స్‌, జూన్‌ 25)
► క్లింట్‌ (జియో సినిమా, జూన్‌ 25)
► ధూప్‌ కీ దీవార్‌ వెబ్‌ సిరీస్‌ (జీ 5, జూన్‌ 25)
► బాష్‌ సీజన్‌ 7 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జూన్‌ 25)
► మోహనగర్‌ (హోయ్‌చోయ్‌, జూన్‌ 25)
► లాల్‌ సలామ్‌ (జీ5, జూన్‌ 25)
► సెక్స్‌/లైఫ్‌ (నెట్‌ఫ్లిక్స్‌, జూన్‌ 25)