Moviesనితిన్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలివే..!!

నితిన్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలివే..!!

యంగ్ హీరో నితిన్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లు అయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో నితిన్ కూడా ఒకడు. “జయం” సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇన్ని సంవత్సరాల్లలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నితిన్. ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు నితిన్. అందులో చెక్ సినిమా ఆశించనంతగా హిట్ కాకపోగా.. రంగ్ దే మూవీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది.

ఇప్పుడు నితిన్ అశ‌లు అన్ని మాస్ట్రో సినిమా మీదేనే ఉన్నాయి. బాలీవుడ్ లో హిట్ అయిన అంథాదూన్ సినిమా ఆధారంగా మాస్ట్రో ను నిర్మించారు. అయితే ఈ సినిమా క‌రోనా కార‌ణంగా ఓటీటీకి వెళుతోంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఫైన‌ల్ డీల్‌ను క్లోజ్ చేసేశార‌ని తెలుస్తోంది. మాస్ట్రోను హాట్ స్టార్ రు. 32 కోట్ల‌కు కొనేసింది.

ఇది ఇలా ఉండగా.. నితిన్ తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ దాదాపు అందరి స్టార్ డైరెక్టర్లతోనూ సినిమాలు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో ‘సై’,త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘అఆ’, వినాయక్ డైరెక్షన్లో ‘దిల్’, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘హార్ట్ ఎటాక్’, కృష్ణ వంశీ డైరెక్షన్లో ‘శ్రీ ఆంజనేయం’, తేజ డైరెక్షన్లో ‘జయం’ ‘ధైర్యం’ వంటి సినిమాలు చేశాడు. నితిన్ ఇప్పటి వరకు 25 సినిమాలు చేశారు.

ఐతే నితిన్ ఇప్పటి వరకు 12 సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. కొన్ని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వదలుకున్నారు. మరికొన్నింటినీ కాంబినేషన్ సెట్ కాక తిరస్కరించారు. అలా ఆయన వదిలేసిన సినిమాలు కొందరు హీరోలకు వరంగా మారాయి. మరికొందరు హీరోలు మాత్రం దారుణంగా ఫ్లాపులు అందుకున్నారు. మరి నితిన్ వదిలేసిన ఆ సినిమాలేంటో చూద్దాం… ఆర్య, ధన 51, భలే దొంగలు, మనం, పిల్లా నువ్వు లేని జీవితం, శతమానం భవతి, ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు, గల్లీ బాయ్ తెలుగు రీమేక్, ఒరేయ్ బుజ్జిగా, పవర్ పేట, మా అమ్మ మహాలక్ష్మి.. తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ ఈ సినిమాలను మిస్ చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news