అందనంత ఎత్తులో ఎన్టీఆర్‌..టచ్ చేసే దమ్ముందా..??

టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏ హీరోకూ లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు హీరోగా ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. అంతగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం జూనియర్ టాప్ హీరో. నందమూరి వంశం నుంచి వచ్చి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఇప్పుడు బాబాయ్ కంటే చాలా పైనే ఉన్నాడు తారక్. సింహాద్రి సినిమాతో స్టార్ అయిన ఎన్టీఆర్.. దానికి ముందే ఆది, స్టూడెంట్ నెం 1 సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి వరుస హిట్‌లతో ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. టాప్ హీరోల్లో ఒకరుగా కొనసాగుతూ వస్తోన్న ఆయనతో సినిమా చేయడానికి తెలుగు సినిమా దర్శకులే కాక, ఇతర భాషా సినిమాల దర్శకులు కూడా పోటీ పడుతుంటారు.

కాగా ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాలకు 70 నుంచి 80 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు సినిమాకు 30 కోట్ల వరకు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్..ఇప్పుడు రెండింతలు పెంచేసాడని తెలుస్తుంది. ఐదేళ్ళుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారు.