Moviesబ్రేకింగ్‌: రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తి మ‌హేశ్‌కు గాయాలు..

బ్రేకింగ్‌: రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తి మ‌హేశ్‌కు గాయాలు..

ప్రముఖ సినీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేశ్‌కు ఈ రోజు కారు ప్ర‌మాదంలో గాయాలు అయ్యాయి. ఆయ‌న ప్ర‌యాణిస్తోన్న కారు నెల్లూరు జిల్లాలోని కొడ‌వ‌లూరు మండ‌లం చంద్ర‌శేఖ‌ర పురం జాతీయ ర‌హ‌దారి వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంది. ఆ కారు జాతీయ ర‌హ‌దారిపై ముందుగా వెళుతోన్న వాహ‌నాన్ని ఢీ కొట్టింది. దీంతో మ‌హేష్ కారు ముందు భాగం దెబ్బ‌తింది. అయితే ఎయిర్ బ్యాగ్స్ వెంట‌నే తెర‌చుకోవ‌డంతో మ‌హేశ్‌ గాయాల‌తో బ‌య‌ట ప‌డిన‌ట్టు తెలుస్తోంది. గాయాల‌కు గురైన మ‌హేశ్ ను వెంట‌నే నెల్లూరు న‌గ‌రంలోని ఓ ఆసుప‌త్రికి త‌రలించారు. క‌త్తి మ‌హేశ్ చిత్తూరు జిల్లాలోని త‌న స్వ‌గ్రామానికి వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news