Moviesఅవ‌కాశాలు లేక ప‌వ‌న్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లు చేస్తుందా.. !

అవ‌కాశాలు లేక ప‌వ‌న్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లు చేస్తుందా.. !

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా 1998లో వ‌చ్చిన `సుస్వాగతం` సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి నిర్మాణంలో వ‌చ్చిన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీ కోలీవుడ్ న‌టి దేవయాని హీరోయిన్‌గా న‌టించింది.

 

తెలుగులో దేవ‌‌యానికి ఇదే తొలి చిత్రం. అయిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసి.. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రం త‌ర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, మాణిక్యం, నాని వంటి చిత్రాల్లో న‌టించింది. అయితే ఈ చిత్రాలు ఏవి కూడా ఆమెకు ఓ మోస్త‌రు గుర్తింపు మిన‌హా.. భారీ క్రేజ్ అయితే ద‌క్క‌లేదు. దీంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దేవ‌యాని నిల‌దొక్కుకోలేక‌పోయింది.

 

 

మ‌రోవైపు తమిళ, మలయాళం, బెంగాళీ మ‌రియు హిందీ భాష‌ల్లో కూడా న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా క్లీక్ కాలేక‌పోయింది. ఇక ఇదే స‌మ‌యంలో తమిళ సినిమా దర్శకుడు రాజకుమారన్ ను ప్రేమించి.. పెద్ద‌ల అంగీక‌రం లేక‌పోయిన పెళ్లి చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఇనియా, ప్రియాంక అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెళ్లి త‌ర్వాత అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో.. చివ‌ర‌కు క్యారెక్ట‌ర్ అర్జిస్ట్‌గా సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. ఇటీవ‌ల ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో మెహన్ లాల్ కు భార్యగా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news