గోపీచంద్ తండ్రి ఎవ‌రో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

హీరో గోపీచంద్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలి వలపు` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన గోపీచంద్‌.. జయం, నిజం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో విల‌న్‌గా ప్రేక్ష‌కుల‌కు అమితంగా ఆక‌ట్టుకున్నారు. ఇక ఆ త‌ర్వాత మ‌ళ్లీ హీరీగా నిల‌దొక్కుకుని ప‌లు హిట్ సినిమాలు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

 

ఇదిలా ఉంటే.. గోపీచంద్ హీరోగానే చాలా మందికి తెలుసు. కానీ, ఒక‌ప్పుడు సంచలన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన సుప్రసిద్ద దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ కుమారుడ‌ని త‌క్కువ మందికి తెలుసు. టి. కృష్ణ గారి విష‌యానికి వ‌స్తే.. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు ఇలా ప్రతి ఒక్క చిత్రం ఒక్కో సంచలనంగా నిలిచింది.

 

 

అతి తక్కువ బడ్జెట్‌తో ఒక ప్రయోజనాత్మక చిత్రాన్ని రూపొందించటం ఆయనకే సాధ్యమయిందంటే అతిశయోక్తి కాదు. ఇక తాను నమ్మిన సిద్ధాంతాలపై ఎక్కడా రాజీపడని టి. కృష్ణ కేవ‌లం మూడు ప‌దుల వ‌య‌సులోనే ఎన్నో విష‌యాల‌ను అందుకున్నాడు. అలాంటి గొప్ప వ్య‌క్తి 1986లో క్యాన్స‌ర్ కార‌ణంగా మ‌ర‌ణించారు. అయితే భౌతికంగా టి.కృష్ణ దూరమైనా ఆయన తీసిన సినిమాలు నేటికీ తెలుగుప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచే ఉన్నాయి. ఇక ఆయ‌న త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన గోపీచంద్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.