ఆ స్టార్ హీరోకు లేడీ వీక్‌నెస్‌.. పొగ‌రు కూడా.. టాలీవుడ్ విల‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగులో కోట శ్రీనివాస‌రావు, బాబూ మోహ‌న్ త‌ర్వాత ఆ స్థాయి ఉన్న విల‌న్లు రావ‌డం లేదు. కొంద‌రు విల‌న్లు వ‌స్తున్నా వారి ప్ర‌తిభ‌ను మ‌న వాళ్లు ఎంక‌రేజ్ చేయ‌డం లేదు. దీంతో వాళ్లు మ‌రుగున ప‌డిపోతున్నారు. ఈ లిస్టులోకే వ‌స్తారు ప్ర‌ముఖ తెలుగు విల‌న్ విజ‌య రంగ‌రాజ‌న్. కేఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి య‌జ్ఞం సినిమాలో విల‌న్‌గా మెప్పించిన ఆయ‌న ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశారు. ప్ర‌తిభ ఉన్నా స‌రైన ఛాన్సులు లేక రేసులో వెన‌క‌ప‌డ్డారు.

 

 

ఇటీవ‌లు ప‌లు యూట్యూబ్ ఛానెల్స్‌కు వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెడుతున్నారు. తాజాగా ఆయ‌న క‌న్న‌డ సీనియ‌ర్ హీరో విష్ణువ‌ర్థ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విష్ణువ‌ర్థ‌న్‌కు క్రేజ్ వ‌చ్చాక పొగ‌రు ఎక్కువ అయ్యింద‌ని.. ఆయ‌న‌కు బాగా లేడీస్ వీక్‌నెస్ ఉంద‌ని చెప్పాడు. ఓ సారి విష్ణువ‌ర్థ‌న్ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా… అందులో సీనియ‌ర్ అయిన జయ‌మాలిని న‌టిస్తుంద‌ని తెలిసి అక్క‌డ‌కు వెళ్లానని ఆయ‌న చెప్పారు.

 

జ‌యమాలినితో త‌న‌కు ఉన్న చ‌నువుతో ఆమె త‌న‌ను చూడ‌గానే వెన‌క నుంచి వ‌చ్చి వాటేసుకుంద‌ని.. అయితే విష్ణువ‌ర్థ‌న్ మాత్రం అసూయ‌తో త‌మ‌పై ఫైర్ అయ్యాడ‌ని విజ‌య్ రంగ‌రాజ‌న్ చెప్పారు. ఇక అంత‌కుముందే పెళ్లిళ్ల బ్రోక‌ర్ల ద్వారా జ‌య‌మాలినిని పెళ్లి చేసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని.. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌మ పెళ్లి కుద‌ర్లేద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్నారు.