Moviesహీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుమ - రాజీవ్ క‌న‌కాల కొడుకు

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుమ – రాజీవ్ క‌న‌కాల కొడుకు

హీరో శ్రీకాంత్ కొడుకు రోష‌న్‌, సుమ – రాజీవ్ క‌న‌కాల కుమారుడు రోష‌న్ క‌న‌కాల కూడా నిర్మలా కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆడ‌క‌పోయినా ఆ సినిమాలో న‌టించిన ఈ ఇద్ద‌రికి న‌టులుగా మంచి మార్కులే ప‌డ్డాయి. నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత శ్రీకాంత్ కొడుకు రోష‌న్ ఇప్పుడు కె. రాఘ‌వేంద్ర‌రావు పెళ్లిసంద‌డి 2తో మ‌ళ్లీ హీరోగా న‌టిస్తున్నాడు. ఇక సుమ – రాజీవ్‌ల త‌న‌యుడు రోష‌న్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

 

గ‌త కొద్ది రోజులుగా రోష‌న్ క‌న‌కాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడ‌న్న వార్త‌లు అయితే వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు అవి నిజం అయ్యాయి. రోష‌న్ హీరోగా న‌టించే సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. జేబీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నూత‌న ద‌ర్శ‌కుడు విజ‌య్ ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా ప్రారంభ‌మైంది. త‌మ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండ‌డంతో రాజీవ్‌, సుమ ఆనందం మామూలుగా లేదు.

 

మా అబ్బాయిని హీరోగా మీ ముందుకు తీసుకు వ‌స్తున్నాం… మీ ప్రేమ ఆశీర్వాదాలు మా వార‌సుడికి కావాల‌ని వారు కోరారు. ఇక రాజీవ్ తండ్రి దేవ‌దాస్ క‌న‌కాల ఎంత‌మందికి న‌ట‌న‌లో శిక్ష‌ణ ఇచ్చారు. అయితే ఆయ‌న వార‌సుడు రాజీవ్ మాత్రం హీరోగా స‌క్సెస్ కాలేక‌పోయినా న‌టుడిగా రాణించాడు. ఇప్పుడు దేవ‌దాస్ మ‌న‌వ‌డు రోష‌న్ హీరోగా ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news