బిగ్ బ్రేకింగ్‌: అమెరికా అధ్య‌క్ష ఫ‌లితాల్లో సీన్ రివ‌ర్స్… ఫలితం మార్చేసిన ఫ్లోరిడా, టెక్సాస్‌

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫలితాలు ఉద‌యం నుంచి తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఉద‌యం నుంచి విజ‌యం అటు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య దోబూచులాడుతున్నాయి. అయితే ఎంతో ఉంత్కంఠ రేకెత్తించిన ఫ్లోరిడా స్టేట్‌లో విజ‌యం సాధించిన ట్రంప్‌, టెక్సాస్‌లో కూడా గెలుపొందారు. ఈ రెండు రాష్ట్రాల ఫ‌లితాలు ట్రంప్‌కు అనుకూలంగా రావ‌డంతో ఫ‌లితం ట్రంప్‌కు అనుకూలంగా వెళుతున్న‌ట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

ఉద‌యం నుంచి కొన‌సాగుతోన్న కౌంటింగ్‌లో ప్రతర్థి బైడెన్‌కూ, ట్రంప్‌కు మధ్య స్వల్ప తేడా ఉండడంతో ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ రెండూ కీల‌క రాష్ట్రాలు ట్రంప్ వ‌శం కావ‌డంతో ట్రంప్ బైడెన్‌కు చేరువ అయ్యారు. ఈ రెండు రాష్ట్రాలే కాకుండా మోంటానా, ఒహైయో, న్యూజెర్సీలోనూ ట్రంప్‌ విజయం సాధించారు.

 

విస్కాన్సిన్‌, మిషిగాన్‌, పెన్సిల్వేనియా, జార్జియాలోనూ ఆయన హవానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు సాధించగా.. బైడెన్‌ 225 ఓట్లు గెలుపొందారు. ప్ర‌స్తుతం కౌంటింగ్ కొన‌సాగుతోన్న ఫ‌లితాల‌ను కూడా చూస్తే మ‌రోసారి ట్రంపే అమెరికా అధ్య‌క్షుడు అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. చివ‌ర్లో ఏదైనా సంచ‌ల‌నం న‌మోదు అయితే త‌ప్పా బైడెన్ గెలిచే ఛాన్సులు లేవు.