నాగార్జున సినిమా టీంలో గొడ‌వ‌లు… రిలీజ్ క‌ష్ట‌మేనా..!

బాలీవుడ్ న‌టుల‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తోన్న సినిమా బ్ర‌హ్మాస్త్ర‌. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైనా ప‌లు కార‌ణాల వ‌ల్ల రిలీజ్ వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. ఈ ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌నుకున్నా ఇప్పుడు వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు అంటున్నారు. తాజాగా ఈ సినిమా మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు అయినా సినిమా వ‌స్తుందా ? అన్న సందేహాలు నెల‌కొన్నాయి.

 

ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన ఫాక్ స్టార్‌కు ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీకి మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ట‌. సినిమాను ముందుగా మూడు గంట‌ల స్క్రిఫ్ట్‌తో తెర‌కెక్కించాల‌ని స్క్రిఫ్ట్ రెడీ చేశార‌ట‌. అయితే రెండున్న‌ర గంట‌ల‌కు సినిమాను కుదించాల‌ని నిర్మాణ సంస్థ అయిన ఫాక్ స్టార్ ప‌ట్టుబ‌డుతోంద‌ట‌. ఈ క‌థ‌ను మూడు గంట‌ల పాటు చూపించాల‌ని … రెండున్న‌ర గంట‌ల పాటు కుదిస్తే ఏ పాత్ర‌కు న్యాయం చేసిన‌ట్టు ఉండ‌ద‌ని ద‌ర్శ‌కుడు అయాన్ అంటున్నాడ‌ట‌.

 

ఈ క్రియేటివ్ విబేధాల వ‌ల్లే ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతానికి ఆగిపోయిందంటున్నారు. అస‌లు మ‌ళ్లీ ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుందా ?  లేదా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నాగార్జున 17 ఏళ్ల త‌ర్వాత బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఏదేమైనా క్రేజీ కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి.