ఆమెతో నాకు పోలికా… 18 నెల‌లు సెక్స్‌కు దూరంగా ఉన్నా అంటోన్న హీరోయిన్…!

బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్.. గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎప్పుడూ వివాస్ప‌ద ఫొటో షూట్ల‌తో హాట్ టాపిక్‌గా మారే సోఫియాపై ఇప్పటికే ఎన్నో వివాదాలున్నాయి. ఇక 2016లో సన్యాసి (నన్)గా మారిపోతున్నానంటూ బహిరంగంగా ప్రకటించింది. ఆ త‌ర్వాత దాదాపు ఏడాదిన్న‌ర పాటు సోఫియా స‌న్‌గా కొన‌సాగింది.

 

 

అయితే ఇటీవ‌ల మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి మారిపోయింది. దీంతో సోఫియాను సనా ఖాన్‌తో పోలుస్తూ నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. సనా ఖాన్ కూడా సినిమాల‌కు గుడ్ బై చెప్పి సన్యాసిగా మారింది. అయితే ఆమె కూడా ఇటీవ‌ల స‌న్యాసాన్ని వ‌దిలేసి.. పెళ్లి చేసుకుంది. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు సనా మరియు సోఫియా ను పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఇద్దరే అంటూ వారి గత నిర్ణయాలను ఆ తర్వాత మార్చుకున్న తీరును విమ‌ర్శిస్తున్నారు.

 

 

అయితే త‌న‌ను స‌నా ఖాన్‌తో పోల్చ‌డంపై సోఫియా స్పందిస్తూ మండిప‌డింది. సోఫియా మాట్లాడుతూ.. `నాతో సనా ఖాన్‌ను పోల్చుతూ కామెంట్స్‌ చేస్తుంటే చిరాకొస్తుంది. వేసుకునే డ్రస్ ను బట్టి ఎలా ఆద్యాత్మికత వస్తుందని మీరు భావిస్తున్నారు. నేను నన్‌గా ఉన్నప్పుడు 18 నెలల పాటు సెక్స్‌కి దూరంగా ఉన్నాను. నన్ గా డ్రస్ వేసుకోనంత మాత్రాన నాలో ఆధ్యాత్మికత తక్కువైపోదు. ఇప్పటికీ నేను ఆధ్యాత్మికతలోనే ఉన్నాను. ఎవ‌రితోనూ న‌న్ను పోల్చ‌కండి` అంటూ నెటిజ‌న్ల‌ను హెచ్చ‌రించింది.