ఎన్టీఆర్‌తో యంగ్ హాటీ బ్యూటీ‌… అందాల ర‌చ్చేగా…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి కొన్ని నెల‌ల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమా చేయ‌నున్నారు. ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. వ‌చ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

 

 

 

ఇక‌ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌కు జోడీని వెతికే ప‌నులో ప‌డ్డారు. ఈ క్రమం‌లోనే హీరోయిన్‌గా మొదట్లో పూజ హెగ్డేను అనుకున్నప్పటికీ.. ఇటీవ‌ల కీర్తి సురేశ్ ని ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ యంగ్ హాట్ బ్యూటీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. `రొమాంటిక్` చిత్రం లో ఆకాష్ పూరి తో రొమాన్స్ చేస్తున్న హాట్ భామ కేతిక శర్మను త్రివిక్ర‌మ్ ఎంపిక్ చేసిన‌ట్టు స‌మాచారం.

 

 

తాను‌ క్రియేట్‌ చేసిన గ్లామర్‌ పాత్రకు కేతికా అయితే పర్ఫెక్ట్ గా సెట్‌ అవుతుందని త్రివిక్ర‌మ్ భావించార‌ట‌. దాంతో కేతిక‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింద‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. ఎన్టీఆర్ సినిమా కి కెతిక అందాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అయితే కీర్తి స్థానంలో కేతిక‌ను ఎంపిక చేశారా లేక రెండో హీరోయినా? అన్నది తేలాల్సి ఉంది.