Moviesహాట్ హీరోయిన్‌పై కేసు న‌మోదు...

హాట్ హీరోయిన్‌పై కేసు న‌మోదు…

ప్ర‌ముఖ బాలీవుడ్ హాట్ బాంబ్‌, హీరోయిన్ అయిన పూనం పాండేపై కేసు న‌మోదు అయ్యింది. ఆమెపై గోవాలోని క‌న‌కోవా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆమె ఇప్ప‌టికే ప‌లు కాంట్ర‌వర్సీల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో ఉంటున్నారు. ఆమె నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో గోవా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌భుత్వ స్థ‌లం అయిన చ‌పోలీ డ్యామ్ వ‌ద్ద పూనంతో అస‌భ్యంగా వీడియో తీస్తోన్న ఓ అజ్ఞాత వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టుకుని అత‌డిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

అయితే గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పూనంపై కేసు పెట్టింది. చ‌పోలీ డ్యామ్ వ‌ద్ద ఇలా చేయ‌డం గోవా ప‌విత్ర‌త‌తో పాటు సంస్కృతిని దెబ్బ తీసిన‌ట్ల‌వుతుంద‌ని ఆ మ‌హిళ‌లు పూనంపై ఆరోప‌ణ‌లు చేశారు. ఇక పూనంపై గ‌తంలోనూ ఆమెపై కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న స‌మ‌యంలోనే ఆమె లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించింద‌ని ఆమెపై అప్ప‌ట్లో పోలీసులు కేసు పెట్టారు.

క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన పూనం నాడు బీఎండబ్ల్యూ కారులో మెరైన్ డ్రైవ్ చేసిన పూనంపై నాడు ముంబై పోలీసులు కేసు నమోదు చేసి బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక వ‌రుస వివాదాల్లో కూరుకుపోతోన్న పూనం 2013లో నషా సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది. ఆగయా హీరో ద జర్నీ ఆఫ్ కర్మ సినిమాల్లో నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news