బీజేపీలోకి బండ్ల గ‌ణేష్‌… ఓ ఆటాడుకుంటున్నారుగా…!

బండ్ల గణేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారిన బండ్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత‌ సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల‌లోకి వెళ్ళాడు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన బండ్ల‌ గణేష్.. పార్టీ గెలవకపోతే `7ఓ క్లాక్ బ్లేడుతో గొంతుకోసుకుంటా` అంటూ స‌వాల్ చేశారు.

 

 

ఆ ఎన్టీక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోగా.. బండ్ల రాజ‌కీయాల్లో సైలెంట్ అయిపోయారు. అయితే బండ్ల చెప్పిన డైలాగ్ మాత్రం ఫుల్ పాపుల‌ర్ అవ్వ‌డ‌మే కాదు.. ఇప్ప‌టికీ నెటిజ‌న్లు బండ్ల‌పై సెటైర్లు వేస్తుంటారు. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ బండ్ల గణేష్ పేరు వినిపిస్తోంది. అయితే ఈ సారి బండ్ల బీజేపీలో చేర‌బోతున్నారంటూ ప్ర‌చారం ఊపందుకుంది.

 

 

 

కానీ, బండ్ల గ‌ణేష్ మాత్రం తనకు ఏ రాజకీయా పార్టీలతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, పవన్ కళ్యాణ్ కు తోడుగా ఆయన శిష్యుడైన బండ్ల గణేష్ బిజెపికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. దీంతో బండ్ల గణేష్ బిజెపిలో చేరడానికి శుభ సమయం 7 ‘ఓ క్లాక్ అని గ‌తంలో ఆయ‌న చెప్పిన డైలాగ్‌ను గుర్తు చూస్తూ ఓ ఆటాడుకుంటున్నారు.