Moviesఎన్టీఆర్ ఛాన్స్ కోసం టాప్ డైరెక్ట‌ర్ ఆశ‌లు... బాక్సాఫీస్ ద‌ద్ద‌రిల్లే కాంబినేష‌నే..!

ఎన్టీఆర్ ఛాన్స్ కోసం టాప్ డైరెక్ట‌ర్ ఆశ‌లు… బాక్సాఫీస్ ద‌ద్ద‌రిల్లే కాంబినేష‌నే..!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు శౌర్యం, శంఖం సినిమాల‌తో ప‌రిచ‌యం అయిన ద‌ర్శ‌కుడు శివ‌. న‌వ‌దీప్ హీరోగా వ‌చ్చిన గౌత‌మ్ ఎస్ఎస్‌సీ లాంటి సినిమాల‌కు కెమేరామెన్‌గా వ్య‌వ‌హ‌రించిన శివ ఆ త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టుకుని గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు తీశాడు. ఆ రెండు స‌రిగా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత అజిత్‌ను ప‌ట్టుకుని వ‌రుస‌గా అత‌డితోనే సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నాడు. ప్ర‌స్తుతం శివ కోలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా దూసుకు పోతున్నాడు.

 

 

శివ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో అన్నాత్తే అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులో గోపీచంద్‌తో రెండు సినిమాలు చేసినా రెండూ ప్లాప్ అయ్యాయి. శివ అంటేనే ఊర‌మాస్ సినిమాలు.. ఈ క్ర‌మంలోనే ఈ సారి శివ క‌న్ను టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌పై ప‌డింద‌ట‌. ఎన్టీఆర్‌తో ఊర‌మాస్ మ‌సాలా సినిమాను తెర‌కెక్కించాల‌ని శివ చూస్తున్నాడ‌ట‌.

 

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఫుల్ బిజీ. 2022 వరకు ఖాళీగా లేరు. శివ ప్ర‌స్తుతం చేస్తోన్న అన్నాత్తే సినిమా కూడా సూప‌ర్ హిట్ అయితే తెలుగు స్టార్లు కూడా పిలిచి శివ‌కు అవ‌కాశం ఇస్తార‌న‌డంలో సందేహం లేదు. ఒక‌వేళ ఎన్టీఆర్కు శివ చెప్పే ఊర‌మాస్ క‌థ న‌చ్చి ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాస్ ప్రియుళ్ల‌కు ఈ సినిమా మాంచి విందు భోజ‌న‌మే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news