ఆ డైరెక్ట‌ర్‌కు అల్లు అర్జున్‌కు ఉన్న లింక్ ఇదే… అప్పుడే ఫ్రెండ్సా…!

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – దర్శకుడు మారుతి మ‌ధ్య ఇప్పుడే కాదు బ‌న్నీ సినిమాల్లోకి రాక‌ముందు నుంచే ప‌రిచ‌యం ఉంద‌ట‌. అంతే కాదు వీరిద్ద‌రు కూడా సినీ రంగ‌ప్రవేశం చేయక‌ముందు నుంచే ఓ మ‌ల్టీమీడియా కోర్సు చేసే స‌మ‌యంలోనే ఫ్రెండ్స్‌గా అయ్యార‌ట‌. అప్ప‌టి నుంచి వీరి స్నేహం కొన‌సాగుతూనే ఉంది. ఆ త‌ర్వాత బ‌న్నీ గంగోత్రి సినిమాతో హీరో అవ్వ‌డంతో పాటు ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లోనే తిరుగులేని స్టార్ హీరోగా ఉన్నాడు.

 

అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత బ‌న్నీ రేంజ్ ఎలా మారిపోయిందో తెలిసిందే. ఇక మారుతి ఈ రోజుల్లో సినిమాతో డైరెక్ట‌ర్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలో బూతు సినిమాల ద‌ర్శ‌కుడు అన్న పేరున్న మారుతి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత క్లీన్ ఇమేజ్ ఉన్న ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు. ఇప్పుడు మారుతి సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంత‌లా ప‌డిచ‌స్తారో తెలిసిందే.

 

ఇదిలా ఉంటే ఈ రోజు మారుతి పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బ‌న్నీ సైతం త‌న ఓల్డెస్ట్ ఫ్రెండ్ మారుతికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మారుతి థ్యాంక్యూ బన్నీ బాబు.. సో స్వీట్ ఆప్ యూ అంటూ ట్వీట్ చేశాడు. మారుతికి ఇంకా పలువురు సినీ ప్రముఖులు మరియు మీడియా వర్గాల వారు సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.