బాల‌య్య – పూరీ క్రేజీ ప్రాజెక్టు డీటైల్స్ ఇవే…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో మ‌రో సినిమాకు ముహూర్తం రెడీ అవుతోన్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రిలో బాల‌య్య, బోయ‌పాటితో సినిమా చేస్తున్నాడు. ఇక పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ సినిమా చేస్తున్నాడు. వీరిద్ద‌రు చేస్తోన్న ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌యిన వెంట‌నే వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా ఉంటుంద‌ని అంటున్నారు.

 

 

గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన పైసా వ‌సూల్ సినిమా ప్లాప్ అయినా బాల‌య్య‌ను పూరి కొత్త‌గా ప్ర‌జెంట్ చేశార‌న్న మంచి మార్కులు పూరికి ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలోనే పూరితో మ‌రో సినిమా చేస్తాన‌ని బాల‌య్య చెప్పాడు. పూరి కూడా తాను క‌థ చెప్ప‌కుండానే బాల‌య్య సినిమా ఓకే చేస్తాడ‌ని ప‌లుమార్లు చెప్పాడు. ఇక పూరి త‌ర్వాత సినిమా చిరంజీవితో లేదా మ‌హేష్‌తో ఉంటుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే వారిద్ద‌రు కూడా పూరీకి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేర‌ట‌. ఈ క్ర‌మంలోనే బాల‌య్య బోయ‌పాటి త‌ర్వాత పూరీతో చేసేందుకు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.  ఈ సినిమా నిర్మాత‌లు, ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.