రాజకీయాలుప‌దేళ్ల రికార్డు బ్రేక్‌.. త‌డిసి ముద్ద‌యిన హైద‌రాబాద్‌

ప‌దేళ్ల రికార్డు బ్రేక్‌.. త‌డిసి ముద్ద‌యిన హైద‌రాబాద్‌

హైద‌రాబాద్‌లో ప‌దేళ్ల నాటి రికార్డును బ్రేక్ చేసేలా కుంభ‌వృష్టి కురిసింది. 2002లో 23 సెం.మీలు, 2010లో 14సెం.మీలు, ఈనెల 9న 15.1సెం.మీలు వ‌ర్షం న‌మోదు అయ్యింది. ప‌దేళ్ల క్రింద‌ట 2010లో 14 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ప‌డ‌గా ఇప్పుడు మ‌ళ్లీ ప‌దేళ్ల‌కు 15.1 సెంటిమీట‌ర్ల వ‌ర్షం న‌మోదు అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండంతో పాటు ఉత్త‌ర క‌ర్నాట‌క, రాయ‌ల‌సీమ మీద‌గా ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ద్రోణుల ప్ర‌భావంతో వ‌ర్షం భీభ‌త్సంగా కురిసింది.

Hyderabad gets heaviest rains in 100 years, Twitter not amused as infra  crumbles

గ్రేట‌ర్లో ఈ సారి భారీగా వ‌ర్షాలు కుర‌వ‌డంతో నాలుగు నెలల్లోనే సాధారణం కంటే 34శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2019 శీతాకాలం, 2020లో వేసవికాలం పెద్దగా కనిపించకపోవడంతో వర్షాలు పెద్ద‌గా కుర‌వ‌వ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ భారీ వ‌ర్షాలు కురుస్తూ రికార్డు న‌మోదు చేస్తున్నాయి. ఇక మ‌రో మూడు నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news