బుల్లితెర విషాదం.. టాప్ సీరియ‌ల్ న‌టి మృతి

బుల్లితెర‌పై కుంకుమ భాగ్య సీరియల్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియ‌ల్లో ప్ర‌ముఖ పాత్ర‌లో న‌టించిన ఇందుదాది పాత్ర ధారి జ‌రీనా ఖాన్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు మైమ‌ర్చిపోయేలా చేశారు. ఈ పాత్ర‌తో ఎంతో పాపుల‌ర్ అయిన జ‌రీనా ఖాన్ ( 54) గుండెపోటుతో మృతి చెందారు. జ‌రీనా మ‌ర‌ణంతో న‌టులు అహ్లువాలియా, శ్రీతి జా, జరీనా ఖాన్ కు భావోద్వేగ వీడ్కోలు పలుకుతూ.. ఓ పిక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 

ఆమె మృతిపై బాలీవుడ్ సినీ, బుల్లితెర నటీన‌టులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఆమెతో ఉన్న అనుబంధాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. జరీనా కుంకుమ్ భాగ్య సీరియల్‌తో పాటు ఇతర టీవీ షోలల్లోను నటించింది. జ‌రీనా మృతి ప‌ట్ల‌ టీవీ నటుడు అనురాగ్ శర్మ.. తన సంతాపాన్ని తెలియజేస్తూ.. జరీనా ఖాన్ మరణ వార్త నాకు షాక్‌గా ఉంద‌ని. ఈ వ‌య‌స్సులోనూ ఆమె ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేద‌ని చెప్పారు.