ధోనీకి సీనియ‌ర్ క్రికెట‌ర్ దిమ్మ తిరిగే కౌంట‌ర్‌… ఇదా నీ స్పార్క్‌

ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. దాదాపు ఆ జ‌ట్టు నాకౌట్ ఆశ‌లు గ‌ల్లంతైన‌ట్టే అంటున్నారు. ఇక ఈ సారి పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు అంద‌రు జ‌ట్టు కెప్టెన్ ఎంఎస్‌. ధోనీని బాధ్యుడిగా చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా కేదార్ జాద‌వ్ వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్నా ధోనీ మాత్రం అత‌డికి వ‌రుస‌గా ఛాన్సులు ఇస్తుండ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

 

ఇక నిన్న చెన్నై వ‌ర్సెస్ రాజ‌స్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కూడా మరోసారి కేదార్ జాదవ్ కి అవకాశం కల్పించాడు ధోని. ఈ ఛాన్స్ కూడా వ‌దులుకున్న కేదార్ జాద‌వ్ రాణించ‌లేదు. మ్యాచ్ అనంత‌రం ధోనీ మాట్లాడుతూ యువ ఆట‌గాళ్ల‌లో స్పార్క్ లేద‌ని.. అందుకే వాళ్ల‌ను తాను జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేద‌ని చెప్పాడు. దీనిపై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

ఇక సీనియ‌ర్ ఆట‌గాడు, భార‌త మాజీ కెప్టెన్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ ధోనీ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ‌డంతో పాటు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. యువ ఆట‌గాళ్ల‌లో నీకు క‌నిపించ‌ని స్పార్క్ కేదార్ జాద‌వ్‌లో క‌నిపిస్తోందా ? అని ప్ర‌శ్నించాడు.  ఇక ధోనీ ఆట‌తీరుపై వ్య‌క్తిగ‌తంగా కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.