చిరు ఎందుకిలా చేస్తున్నాడు… ఫ్యాన్స్‌కే న‌చ్చట్లేదు…!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆయ‌న వ‌రుస‌గా స్ట్రైట్ క‌థ‌లు కాకుండా రీమేక్ క‌థ‌లు ఎంచుకోవ‌డం చాలా మందికి న‌చ్చ‌డం లేదు. అస‌లు చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 చేయ‌డ‌మే చాలా మంది అభిమానుల‌కు న‌చ్చ‌లేదు. సైరా త‌ర్వాత ప్ర‌స్తుతం ఆచార్యలో న‌టిస్తున్నాడు. ఆచార్య త‌ర్వాత వ‌రుస‌గా ఇత‌ర భాష‌ల్లో హిట్ అయిన సినిమాలు చేసేందుకే ఆస‌క్తి చూపుతున్నాడు.

Pawan Kalyan confirms Chiranjeevi-Meher Ramesh 'Vedalam' remake | The News  Minute

మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో వేదాళం రీమేక్‌లో న‌టించేందుకు రెడీ అవుతోన్న చిరు, లూసీఫ‌ర్ రీమేక్‌ను వినాయ‌క్‌కు అప్ప‌గించాడు. మిగిలిన సీనియ‌ర్ హీరోలు కొత్త క‌థ‌ల‌తో మంచి ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటే చిరు ఎందుకు ఈ రీమేక్‌ల‌ను ప‌ట్టుకుని వేలాడుతున్నాడంటూ ఫ్యాన్స్ ఆందోళ‌న‌లో ఉన్నారు. ఈ రెండు రీమేక్‌లె మాస్ మ‌సాళాలే. పైగా ప‌ర‌మ రొటీన్ క‌థ‌లు.

Vedalam' Telugu remake: Chiranjeevi-starrer to be shot in Kolkata? | Deccan  Herald

ఇవే ఇలా ఉంటే ఇప్పుడు అజిత్ న‌టించిన ఎన్నై అరిందాల్ రీమేక్‌పై ఆస‌క్తితో ఉన్నాడ‌ట‌. ఇది కూడా తెలుగులో ఎంత‌వాడు గానీ పేరుతో వచ్చి ఓ మోస్త‌రుగా ఆడింది. కోలీవుడ్‌లో హిట్ అయ్యి తెలుగులో కూడా వ‌చ్చిన సినిమాల‌పై చిరు ఎందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడో ఫ్యాన్స్‌కు అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

 

గ‌తంలో ప‌వ‌న్ కూడా అజిత్ వీర‌మ్ ఇక్క‌డ వీరుడొక్క‌డేగా వ‌చ్చినా దానిని మ‌ళ్లీ కాట‌మ‌రాయుడుగా తీశాడు. ప్లాప్ అయ్యింది. ఇప్పుడు చిరు కూడా అదే బాట‌లో వెళుతున్నాడు.