Moviesరాజ‌మౌళి నిర్ణ‌యంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

రాజ‌మౌళి నిర్ణ‌యంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తోన్న ఎన్టీఆర్ పాత్ర‌కు సంబంధించి టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్‌కు ఎట్ట‌కేల‌కు రాజ‌మౌళి తీపిక‌బురు అందించాడు. ఇలా షూటింగ్ ప్రారంభ‌మైందో లేదో వెంట‌నే తార‌క్ పాత్ర టీజ‌ర్‌కు సంబంధించి అప్‌డేట్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆర్ ఆర్ ఆర్ గురించి ఒక్క‌టే న్యూస్ ట్రెండ్ అవుతోంది.

 

ఏదేమైనా టీజ‌ర్ అప్‌డేట్ రావ‌డంతో తార‌క్ ఫ్యాన్స్ మామూలు ఖుషీగా లేరు. అయితే రాజ‌మౌళి తార‌క్ రోల్ టీజ‌ర్ త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం కాస్తా ఇప్పుడు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌లో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. అదేంటి ఆర్ ఆర్ ఆర్‌లో తార‌క్ రోల్ టీజ‌ర్‌కు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు లింకేటి అనుకుంటున్నారా ?  అయితే వీళ్ల‌కు కావాల్సింది రాధే శ్యామ్ టీజ‌ర్‌.

 

ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే రాజ‌మౌళి తార‌క్ కొమ‌రం భీం టీజ‌ర్ అప్‌డేట్ ఇచ్చి తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తే… ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ అయ్యి.. ముడిస‌రుకు రెడీగా ఉన్నా ఇంకా రాధే శ్యామ్ టీజ‌ర్ గురించి ఆ సినిమా యూనిట్ ఏం మాట్లాడ‌డం లేదు. కావాల్సినంత ఫుటేజ్ ఉన్నా కూడా టీజ‌ర్ ఎందుకు రిలీజ్ చేయ‌ర‌న్న‌దే వాళ్ల ఆగ్ర‌హానికి కార‌ణం.

 

ఓ వైపు ఆదిపురుష్ అప్‌డేట్స్ దంచి కొడుతున్నారు. రాధే శ్యామ్ విష‌యంలో మాత్రం బుగ్గున బెల్లం పెట్టుకున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆ సినిమా యూనిట్ చూపిస్తోన్న స్పీడ్‌లో ప‌దో వంతు కూడా రాధే శ్యామ్ యూనిట్‌లో లేద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news