నువ్వే కావాలిని సినిమాను రిజెక్ట్ చేసిన ప‌వ‌న్‌.. కార‌ణం ఇదే.. ఆ టాప్ హీరో కూడా..!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో 2000 అక్టోబ‌ర్ 13న వ‌చ్చిన నువ్వే కావాలి సినిమా క్రియేట్ చేసిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. అయితే ఈ సినిమా క‌థ‌ను ముందుగా మ‌ళ‌యాళంలో హిట్ అయిన నీర‌మ్ నుంచి తీసుకున్నారు. ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెప్పార‌ట‌. అయితే అప్ప‌టికే ప‌వ‌న్ సుస్వాగ‌తం, తొలిప్రేమ లాంటి ల‌వ్ స్టోరీలు చేసి ఉండ‌డంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు.

 

 

ఆ త‌ర్వాత అక్కినేని నాగార్జున మేన‌ళ్లుడు సుమంత్‌కు కూడా క‌థ చెప్ప‌గా సుమంత్ కూడా వదులుకున్నాడట. చివ‌ర‌కు విసిగిపోయిన ద‌ర్శ‌క నిర్మాత‌లు చివ‌ర‌కు ధైర్యం చేసి త‌రుణ్‌కు చెప్ప‌డంతో త‌రుణ్ వెంట‌నే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అలా నువ్వేకావాలి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు త‌రుణ్ కెరీర్‌కు మంచి పునాది వేసింది.

 

ఈ సినిమా ఇచ్చిన ఇమేజ్‌తోనే కొన్నేళ్ల పాటు త‌రుణ్ హీరోగా నెట్టుకు వచ్చాడు. ఈ సినిమాను ప‌వ‌న్ లేదా సుమంత్ చేసుంటే వాళ్ల కెరీర్‌లు ఆ టైంలో మ‌రోలా ఉండేవి అన‌డంలో డౌట్ లేదు. ఏదేమైనా ప‌వ‌న్‌, సుమంత్ ఇద్ద‌రు వేసిన రాంగ్ స్టెప్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మిస్ చేసుకున్నారు.