ప‌వ‌న్‌ హీరోయిన్ ఆ ఒక్క కార‌ణంతోనే ఫేడ‌వుట్ అయ్యిందా… తెలుగులో జ‌రిగింది ఇదే..!

అనూ ఇమాన్యుయేల్ కాస్త అందం, అభిన‌యం ఉన్న మంచి న‌టే. తెలుగులో కూడా ప‌వ‌న్ ప‌క్క‌న అజ్ఞాత‌వాసి, బ‌న్నీ ప‌క్క‌న నా పేరు సూర్య లాంటి సినిమాల్లో ఛాన్సులు. మామూలుగా ప‌వ‌న్‌, బ‌న్నీ ప‌క్క‌న ఛాన్సులు అంటే ఆమె రేంజ్ స్వింగ్ అవ్వాలి. కానీ ఆ రెండు సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో అనునూ ఇక్క‌డ ప‌ట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. ఓ వైపు ఫేడ‌వుట్ అవుతున్నా కూడా ఆమె వ‌రుసగా సినిమాలు లైన్లో పెడుతూ అంద‌రికి షాక్ ఇస్తోంది.

 

ప్ర‌స్తుతం ఆమె త‌మిళ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. ఒక్క‌సారిగా ఉన్న‌ట్టు ఉండి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ల‌డంతో పాటు ఆ వెంట‌నే డౌన్ అయ్యి ఛాన్సులు లేకుండా పోవ‌డం వెన‌క ఓ ప్ర‌ధాన కార‌ణం ఉంద‌నే అంటున్నారు. అనూ డ‌బ్బుల కోసం కాకుండా క్రేజ్ కోసం, స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తోంద‌ని.. అందుకే ఆమెకు అవ‌కాశాలు లేకుండా పోతున్నాయ‌ని అంటున్నాయి.

 

 

తెలుగులో ప‌వ‌న్‌, బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్‌గా చేశాక మీడియం రేంజ్ హీరోల ప‌క్క‌న మంచి ఛాన్సులే వ‌చ్చాయ‌ట‌. అయితే ఇక్క‌డ హిట్లు లేక‌పోవ‌డంతో ఆ వెంట‌నే కోలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ ఒక‌టి రెండు హిట్లు ప‌డ‌డంతో ఇక తెలుగును మ‌ర్చిపోయింది. ఎన్టీఆర్‌ అరవింద సమేతలో అవకాశం వచ్చినా వ‌దులుకోవడంతో ఆమె రేసులో వెన‌క్కు వెళ్లిపోయింది.

 

చివ‌ర‌కు ఇప్పుడు ఫేడ‌వుట్ అయిపోయింది. తెలుగులో ఛాన్సులు లేక కోలీవుడ్‌లో న‌టిస్తోంది. అయితే తాజాగా ఇక్క‌డ అజయ్ భూపతి మహాసముద్రంలో ఒక నాయికగా ఆఫర్ అందుకుంది అమ్మడు. ఈ సినిమా అయినా ఆమె రాత మారుస్తుందేమో ?  చూడాలి.