GossipsBB 3 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌... రౌడీ ఎమ్మెల్యేగా యంగ్ హీరో..!

BB 3 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌… రౌడీ ఎమ్మెల్యేగా యంగ్ హీరో..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న బీబీ 3 సినిమా షూటింగ్ క‌రోనా నేప‌థ్యంలో ఐదారు నెల‌ల క్రిత‌మే ఆగిపోయింది. క‌రోనా జోరు కాస్త త‌గ్గిన‌ట్టు ఉండ‌డంతో ఇప్పుడిప్పుడే అంద‌రూ షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీబీ 3 షూటింగ్‌కు కూడా రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ల‌తో పాటు కీల‌క‌మైన రౌడీ ఎమ్మెల్యే పాత్ర‌కు ఎవ‌రిని ఎంపిక చేయాలా ? అని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి త‌ల‌మున‌క‌లై ఉన్నాడు.

Balakrishna and Boyapati showcase their best with BB3 teaser - Gossiper

ఈ క్ర‌మంలోనే అందాల రాక్ష‌సి ఫేం న‌వీన్‌చంద్ర‌ను రౌడీ ఎమ్మెల్యే పాత్ర‌కు ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు ఉన్నా ఆ యంగ్ హీరో ఎవ‌ర‌న్న‌దానిపై క్లారిటీ లేదు. ర‌క‌ర‌కాల పేర్లు ఇక్క‌డ వినిపించాయి. తాజాగా బోయ‌పాటి న‌వీన్ చంద్ర‌ను క‌లిసి ఆ పాత్ర ప్రాధాన్యం గురించి వివ‌రించ‌గా రౌడీ ఎమ్మెల్యేగా చేసేందుకు న‌వీన్ ఓకే చెప్పాడంటున్నారు.

Balakrishna-Boyapati Film BB3 1st Roar Today

ఈ పాత్ర కోసం న‌వీన్ ఏకంగా నెల రోజుల పాటు వ‌ర్క‌వుట్లు చేయ‌నున్నాడ‌ట‌. ఈ యేడాది నుంచి న‌వీన్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. అర‌వింద సమేత సినిమాలో విల‌న్‌గా న‌టించి మెప్పించిన న‌వీన్ చంద్ర మ‌రి బాల‌య్య సినిమాలో రౌడీ ఎమ్మెల్యేగా ఎలా మెప్పిస్తాడో ? చూడాలి. ఈ సినిమాలో న‌వీన్ క్లిక్ అయితే అత‌డి కెరీర్ మ‌రోలా యూట‌ర్న్ ఖ‌చ్చితంగా తీసుకుంటుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news