Politicsవైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో నంద‌మూరి హీరో భేటీ..!

వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో నంద‌మూరి హీరో భేటీ..!

నంద‌మూరి కుటుంబానికి చెందిన క‌థానాయ‌కుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఆళ్ల‌గ‌డ్డ వైసీపీ నేత‌, ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డితో పాటు ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని తార‌క‌ర‌త్న క‌లిశారు. గంగుల కుటుంబం ప్ర‌స్తుతం వైసీపీలో కీల‌కంగా ఉంది. ఇక తార‌క‌ర‌త్న గ‌తంలో వ‌రుస పెట్టి సినిమాలు చేశాడు. అయితే కొంత కాలంగా సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉన్న తార‌క‌ర‌త్న ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఓ సినిమాలో న‌టిస్తున్నాడు.

 

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు గండికోట ప్రాంతంలో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో తార‌క‌ర‌త్న వైసీపీ నాయ‌కుడు గిరిధ‌ర్‌రెడ్డితో క‌లిసి హైద‌రాబాద్‌కు వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే గంగుల ఫ్యామిలీతో ఉన్న పాత ప‌రిచ‌యం నేప‌థ్యంలో తార‌క‌ర‌త్న ప్ర‌భాక‌ర్ రెడ్డి, బిజేంద్రారెడ్డిని క‌లిశార‌ని తెలుస్తోంది.

 

 

గంగుల కుటుంబం గ‌తంలో టీడీపీలో చాలా యేళ్లు క్రియాశీల‌కంగా ప‌నిచేసింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో ఉన్న ప‌రిచ‌యం నేప‌థ్యంలోనే తార‌క‌ర‌త్న గంగుల ఫ్యామిలీని క‌లిశారు. అంత‌కుమించి వీరి భేటీలో ఎలాంటి ప్రాధాన్య‌త లేదంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news