సింగ‌ర్‌పై ఎమ్మెల్యే అత్యాచారం.. ఆ త‌ర్వాత కొడుకు, అల్లుడు కూడా వ‌ద‌ల‌కుండా..!

యూపీ అత్యాచారాల‌కు నిల‌యంగా మారిపోయింది. తాజాగా ఓ ఎమ్మెల్యే త‌న‌పై అత్యాచారం చేశాడంటూ ఓ సింగ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది. అంతే కా కుండా ఆ సింగ‌ర్ ఎమ్మెల్యేతో పాటు అత‌డి కుమారుడు, మేన‌ళ్లుడి మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూపీలో  బీజేపీ మిత్రపక్షమైన నిషద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) ఎమ్మెల్యే  ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 2014లో ఎమ్మెల్యే ఓ కార్య‌క్ర‌మం కోసం బాధిత మ‌హిళ‌ను త‌న ఇంటికి పిలిచారు.

 

ఆ త‌ర్వాత ఎమ్మెల్యే, అత‌డి కుమారుడు త‌న‌పై అత్యాచారం చేయ‌డంతో పాటు  ఈ విష‌యం ఎవ‌రికి అయినా చెపితే చంపేస్తామ‌ని బెదిరించారు. ఆ త‌ర్వాత 2015లో వారణాసిలో ఒక హోటల్ లో ఎమ్మెల్యే మరో సారి బాధితురాలిపై అత్యాచారం చేశాడ‌ని.. ఆ త‌ర్వాత త‌న‌ను ఇంటి ద‌గ్గ‌ర వ‌దిలి పెట్ట‌మ‌ని ఎమ్మెల్యే త‌న మేన‌ల్లుడికి చెపితే అత‌డు కూడా త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని బాధిత మ‌హిళ త‌న ఫిర్యాదులో పేర్కొంది.

 

 

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే  పై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఎమ్మెల్యే ప్ర‌స్తుతం అరెస్టు అయ్యి జైల్లో ఉండ‌డంతో ధైర్యం చేసిన బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దాదాపు 20 రోజుల క్రితం ఆగ్రా సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు.