Moviesసిగ‌రెట్‌తో పొగ‌లు వ‌దులుతూ బాల‌య్య ఫేమ‌స్ డైలాగ్‌తో చంపేసిన హాట్ బ్యూటీ..!

సిగ‌రెట్‌తో పొగ‌లు వ‌దులుతూ బాల‌య్య ఫేమ‌స్ డైలాగ్‌తో చంపేసిన హాట్ బ్యూటీ..!

కొత్త హీరోయిన్లు త్వ‌ర‌గా పాపుల‌ర్ అయ్యేందుకు సోష‌ల్ మీడియాను ఫుల్లుగా వాడుకుంటున్నారు. హాట్ హాట్ స్టిల్స్ షేర్ చేస్తూ తాము కూడా ఛాన్స్ ఇస్తే దేనికైనా రెడీ అన్న సంకేతాలు పంపుతుంటారు. ఉత్త‌రాది భామ అయిన అషిమా న‌ర్వాల్ సిడ్నీ యూనివ‌ర్సిటీలో చ‌దువుతోన్న ఈ అమ్మ‌డికి ప్రేక్ష‌కుల‌ను ఎలా మ‌త్తెక్కించాలో.. ఎలా త‌న వైపున‌కు తిప్పుకోవాలో ఆ టెక్నిక్స్ బాగా తెలుస‌ట‌. తెలుగులో 2018లో నాటకం అనే సినిమాతో అడుగుపెట్టింది.

 

తొలి సినిమాతోనే ఎంతో ఆక‌ట్టుకున్న ఆమె క‌వ్వించే అందాలు చాలా ప్ల‌స్ అయ్యాయి. ఆ త‌ర్వాత జెస్సీ, కోలైగ‌ర‌న్, రాజ‌భీమ సినిమాల‌కు ఓకే చెప్పింది. రాజ‌భీమ అనే త‌మిళ్ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే లాక్‌డౌన్ వేళ కూడా త‌న‌ను అంద‌రు గుర్తు పెట్టుకునేందుకు అషిమా సోష‌ల్ మీడియాలో కొన్ని టిప్స్‌తో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

 

తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలు బాగా వైర‌ల్ అవ్వడంతో ఆమె మ‌రింత పాపుల‌ర్ అయ్యింది. ఈ వీడియోలో అషిమా నార్వాల్ సిగ‌రెట్ తాగుతూ చాలా స్టైల్‌గా పొగ‌లు వ‌దులుతోంది. పైగా సిగ‌రెట్ తాగుతూనే బాల‌య్య పాపుల‌ర్ డైలాగ్ డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్ చెప్పింది. అలాగే హైద‌రాబాద్ రోడ్ల‌పై తిర‌క్కండి అని కూడా చెప్పుకొచ్చింది. అయితే చివ‌ర్లో ట్విస్ట్ ఇస్తూ తాను త్వ‌ర‌లో న‌టించే పాత్ర‌పై ప‌ట్టు సాధించేందుకే తాను ధూమ‌పానం చేస్తున్నాన‌ని చెప్పింది.

 

https://www.instagram.com/p/CGUtCS9Hu7H/

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news