Moviesగూగుల్‌లో అనుష్క శ‌ర్మ భ‌ర్త ఎవ‌రో తెలుసా.. కోహ్లీ కాదు మ‌ర...

గూగుల్‌లో అనుష్క శ‌ర్మ భ‌ర్త ఎవ‌రో తెలుసా.. కోహ్లీ కాదు మ‌ర స్టార్ క్రికెట‌ర్‌

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి ఎవ‌రు ? అంటే ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ విరాట్ కోహ్లీ అని చెపుతాం. దేశంలోనే ఈ జంట ఎంత ప్ర‌త్యేక‌మైన స్టార్ క‌పులో చెప్ప‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల కోహ్లీ ఇన్‌స్టా గ్రామ్‌లో అనుష్క ఫొటో షేర్ చేస్తే దానికి వ‌చ్చిన లైకులు, షేర్లు ఆసియాడ్‌లోనే రికార్డు క్రియేట్ చేశాయి. ఆసియా ఖండంలోనే ఏ వ్య‌క్తి షేర్ చేసిన ఫొటోకు రాని లైకులు, కామెంట్ల‌తో అనుష్క‌, విరాట్ కోహ్లీ ఫొటో రికార్డు క్రియేట్ చేసింది.

 

అలాంటి జంట‌ను గూగుల్ విగ‌దీసింద‌న్న కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్ర‌ముఖ అప్ఘ‌నిస్తాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ భార్య ఎవ‌రు అని గూగుల్లో సెర్చ్ చేస్తే అనుష్క శ‌ర్మ పేరు వ‌స్తోంది. దీంతో ర‌షీద్ భార్య‌గా అనుష్క పేరు ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. విచిత్రం ఏంటంటే ప్ర‌స్తుతం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆడుతోన్న ర‌షీద్‌కు అసలు పెళ్లే కాలేద‌ట‌.

 

 

2018లో తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో రషీద్ ఖాన్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రీతి జింతా అని అనడం ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా గూగుల్లో సెర్చ్ చేస్తే ర‌షీద్ భార్య‌గా అనుష్క‌ను చూపిస్తోంది. మ‌రి దీనిపై అనుష్క‌, ర‌షీద్ ఎలా స్పందిస్తారో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news