Moviesఈ టాప్ హీరోయిన్ల అస‌లు పేర్లు మీకు తెలుసా..

ఈ టాప్ హీరోయిన్ల అస‌లు పేర్లు మీకు తెలుసా..

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది క్రేజ్ వ‌చ్చాక మోడ్ర‌న్ పేర్లు పెట్టుకుంటారు. మ‌రి కొంద‌రికి త‌మ కెరీర్ తొలి ద‌శ‌లోనే ఏ ద‌ర్శ‌కుడో పేరు మార్చేస్తుంటాడు. నాడు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు అయితే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు మార్చేశాడు. ఇక ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్లుగా చెలామ‌ణి అవుతోన్న వారిలో చాలా మంది కూడా త‌మ పేర్లు మార్చుకున్నవారే. ఈ లిస్టు ఓ సారి చూద్దాం.

 

 

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ క‌త్రీనాకైఫ్ అస‌లు పేరు ట‌ర్కోట్టే. ఇక బాలీవుడ్ నిన్న‌టి త‌రం అందాల తార రేఖ అస‌లు పేరు రేఖా గ‌ణేష‌న్‌. ఆమె జెమినీ గ‌ణేష‌న్ కుమార్తె అన్న విష‌యం తెలిసిందే. ఇక పొడుగు కాళ్ల సుంద‌రి శిల్పా శెట్టి అస‌లు పేరు అశ్వినీ శెట్టి. స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ అస‌లు పేరు సుజాత‌. ఇక పోర్న్ స్టార్ నుంచి ఇప్పుడు బాలీవుడ్‌ను ఏలుతోన్న హాట్ బాంబ్ స‌న్నీలియోన్ అస‌లు పేరు క‌రెంజిత్ కౌర్ వోహ్రా.

 

జ‌య‌ప్ర‌ద అస‌లు పేరు ల‌లితారాణి. అతిలోక సుంద‌రి శ్రీదేవి అస‌లు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్య‌ప్ప‌న్‌. దివంగ‌త న‌టి సౌంద‌ర్య అస‌లు పేరు సౌమ్య‌. అనుష్క పేరు స్విటీ శెట్టి – రోజాకు ముందు శ్రీల‌తా రెడ్డి పేరు ఉండ‌గా దివంగ‌త మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ ఆమె పేరు రోజాగా మార్చారు. రంభ అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి, న‌య‌న‌తార అస‌లు పేరు డ‌యానా కుట్టి మారియ‌న్‌, భూమిక అస‌లు పేరు ర‌చ‌నా చావ్లా.

 

 

రాశీ అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. కియారా అద్వానీ అస‌లు పేరు అలియా అద్వానీ. కొంద‌రు తమ ద‌శ మార‌డం కోసం కూడా పేర్లు మార్చుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news