Moviesన‌టుడు కాశీ విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తెలుసా..

న‌టుడు కాశీ విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తెలుసా..

కాశీ విశ్వ‌నాథ్ అన‌గానే మ‌న‌కు సినిమాల్లో క్యారెక్ట‌ర్ న‌టుడుగా ఉన్న కాశీ విశ్వ‌నాథ్ మాత్ర‌మే తెలుసు. ఆయ‌న హీరోకో లేదా హీరోయిన్‌కో తండ్రిగా మాత్ర‌మే వేషాలు వేస్తుంటారు. అయితే ఆయ‌న ఓ డైరెక్ట‌ర్ అన్న విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఆయ‌న సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన నువ్వులేక నేనులేను లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. 2002 సంక్రాంతికి బాల‌య్య సీమ‌సింహం, మ‌హేష్‌బాబు ట‌క్క‌రిదొంగ సినిమాల‌కు పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

 

త‌రుణ్ – ఆర్తీ అగ‌ర్వాల్ కాంబినేష‌న్లో ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలోని నిండు గోదారి క‌థ ఈ ప్రేమ అన్న పాట ఇప్ప‌ట‌కీ మ‌న‌కు విన‌ప‌డుతూనే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే త‌రుణ్ – ఆర్తీ ప్రేమించుకున్నార‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత కాశీ విశ్వ‌నాథ్ నంద‌మూరి హీరో కళ్యాణ్‌రామ్ డెబ్యూ మూవీ తొలిచూపులోనే సినిమాను కూడా డైరెక్ట్ చేశారు.

 

తొలి చూపులోనే క‌ళ్యాణ్‌రామ్ డెబ్యూ మూవీ అయినా ఈ సినిమా సరిగా ఆడ‌లేదు. క‌ళ్యాణ్‌రామ్ ప‌క్క‌న ఆకాంక్ష హీరోయిన్‌. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఆ త‌ర్వ‌త కాశీ విశ్వ‌నాథ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news