బాల‌య్య వ‌ర్సెస్ చిరు… మ‌రో బిగ్‌ఫైట్‌కు ముహూర్తం రెడీ..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి నాలుగు ద‌శాబ్దాలుగా సినిమాల్లో ఉన్నా ఇప్ప‌ట‌కీ అదే జోష్‌తో.. అదే స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. చిరు చేతిలో ప్ర‌స్తుతం ఆచార్య త‌ర్వాతే నాలుగు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. బాల‌య్య బోయ‌పాటి సినిమా చేస్తున్నాడు. వీరిద్ద‌రి సినిమాలు ఎప్పుడు సంక్రాంతికి వ‌చ్చినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ మామూలుగా ఉండేది కాదు. థియేట‌ర్లు హోరెత్తిపోయేవి. చాలా యేళ్ల త‌ర్వాత 2017 సంక్రాంతికి వీరిద్ద‌రు ఖైదీ నెంబ‌ర్ 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల‌తో పోటీ ప‌డ్డారు.

 

రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే మ‌రోసారి వీరిద్ద‌రి సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఢీ కొట్టేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. 2021 ఉగాది ఏప్రిల్ 9న ఆచార్య సినిమాకు రిలీజ్ డేట్‌గా లాక్ చేశార‌ట‌. అదే రోజు బాల‌య్య – బోయ‌పాటి మూవీని కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. రెండు సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. వీరిద్ద‌రు మాస్ హీరోలు కావ‌డంతో పాటు ఈ రెండు సినిమాలు మాస్ సినిమాలే కావ‌డంతో బాక్సాఫీస్ ఖ‌చ్చితంగా హీరోత్తిపోవ‌డం ఖాయం.