బాల‌య్య న‌ర్త‌న‌శాల ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది…

బాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఎప్పుడో రెండు ద‌శాబ్దాల క్రితం ప్రారంభ‌మైన న‌ర్త‌న‌శాల‌. మహాభారతంలోని నర్తన శాల ఇతివృత్తంగా ఈ సినిమాని తెరకెక్కించాలని బాలయ్య భావించాడు. ఈ సినిమాలో అర్జునుడిగా బాలయ్య, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. సినిమా కొద్ది రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు.

 

అయితే త‌ర్వాత ద్రౌప‌ది క్యారెక్ట‌ర్ పోషించిన సౌంద‌ర్య హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెంద‌డంతో ఈ సినిమా ఆగిపోయింది. అయితే అంద‌రి కోరిక‌పై బాల‌య్య న‌ర్త‌న‌శాల సినిమాలోని 17 నిమిషాల సీన్ల‌ను ఎడిట్ చేసి ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 24న శ్రేయాస్ ద్వారా ఎన్ బీకే థియేట‌ర్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

 

తాజాగా నర్తనశాల నుండి బాలకృష్ణకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో బాలయ్య లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.