ఆదిపురుష్‌లో హీరోయిన్‌ను ఫిక్స్ చేశారుగా… ఆమె ఫైన‌ల్ అయిన‌ట్టే..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక్కో అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కే ఈ సినిమాలో లంకేశ్‌గా బాలీవుడ్ న‌టుడు సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించే ఈ సినిమా హీరోయిన్ గురించి మ‌రో ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌చ్చింది.

Prabhas roped in for Om Raut directorial Adipurush | Entertainment News,The  Indian Express

ఆదిపురుష్‌లో ప్ర‌భాస్ ప‌క్క‌న బాలీవుడ్ భామ కృతీస‌న‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. ప్ర‌భాస్ రాముడు అయితే సీత‌గా కృతిస‌న‌న్ క‌నిపిస్తుంది. ఈ మేర‌కు చ‌ర్చు కూడా మొద‌ల‌య్యాయి. ఇంత‌కు ముందే ఈ పాత్ర కోసం కియా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు కృతిస‌న‌న్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.

Saif Ali Khan to play the villain in Prabhas starrer Adipurush |

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23న ఆదిపురుష్ హీరోయిన్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక కృతిస‌న‌న్ మ‌హేష్ బాబు ప‌క్క‌న వ‌న్ నేనొక్క‌డినే సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే.