Gossipsఆ హీరోయిన్ చేసిన ప‌నికి చిరుకు టెన్ష‌న్ పట్టుకుందిగా...!

ఆ హీరోయిన్ చేసిన ప‌నికి చిరుకు టెన్ష‌న్ పట్టుకుందిగా…!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య సినిమా క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ సినిమాపై చిరంజీవి, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఇద్ద‌రు యేడాదిన్న‌ర‌గా వ‌ర్క్ చేస్తున్నా ఎప్పుడూ ఏదో ఒక అవాంత‌రం ఎదుర‌వుతూనే వ‌స్తోంది. ఇప్పుడు షూటింగ్‌ల‌కు అనుమ‌తులు రావ‌డంతో అయినా ఆచార్య షూటింగ్ ప‌ర్ఆరంభ‌మ‌వుతుంది అనుకుంటే మ‌రో షాక్ త‌గిలింది. ఈ సినిమా హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకోబోతోంది.

Kajal Agarwal requests people to back small business after lockdown | Tamil  Movie News - Times of India

ఈ నెల చివర్లో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల పాటు ఆమె హ‌నీమూన్ హ‌డావిడితో పాటు పెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయ‌నుంది. క‌రోనా వ‌ల్ల సింపుల్‌గానే కుటుంబ స‌భ్యుల మ‌ధ్య పెళ్లి జ‌రుగుతుంద‌ని చెపుతున్నా పెళ్లి షాపింగ్‌, బ్యాచిల‌ర్ పార్టీలు, సంగీత్ అంటూ చాలా హ‌డావిడి ఉంటుంది. అంటే సుమారుగా మ‌రో నెల‌న్న‌ర రోజుల పాటు ఆచార్య యూనిట్‌కు కాజ‌ల్ అందుబాటులో ఉండ‌దు. దీంతో ఈ సినిమా యూనిట్ మ‌రింత డైల‌మాలో ప‌డింది.

Sisters Kajal Agarwal & Nisha Agarwal - TV9 Telugu

పెళ్లి త‌ర్వాత ఆ మూడ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక కాని కాజ‌ల్ తిరిగి షూటింగ్‌లో పాల్గొదు. దీంతో చిరుతో పాటు ఆచార్య యూనిట్‌లో ఇప్పుడు కాస్త టెన్ష‌న్ నెల‌కొంద‌ని అంటున్నారు. చిరు కూడా ఇప్ప‌టికే సినిమా షూటింగ్ లేట్ అవ్వ‌డంతో అస‌హ‌నంతో ఉండగా.. ఇప్పుడు కాజ‌ల్ లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ‌డం కంటే కాజ‌ల్ వ‌చ్చాకే షూటింగ్ స్టార్ట్ చేసి కంటిన్యూగా షూటింగ్ ఫినిష్ చేద్దామ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల‌కు చెప్పాడ‌ని తెలుస్తోంది.

 

ఇప్ప‌టికే షూటింగ్ బాగా లేట్ అవ్వ‌డంతో ఆచార్య యూనిట్‌కు బ‌డ్జెట్ త‌డిసి మోపెడు అవుతుంద‌న్న టెన్ష‌న్ ఉండ‌గా.. ఇప్పుడు కాజ‌ల్ దెబ్బ‌తో మ‌రో నెల రోజుల పాటు షూటింగ్ వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news