Moviesవ‌కీల్‌సాబ్ ఆల్బ‌మ్ రెడీ... పాట‌ల లెక్క తేలిపోయింది..

వ‌కీల్‌సాబ్ ఆల్బ‌మ్ రెడీ… పాట‌ల లెక్క తేలిపోయింది..

రెండు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న వ‌కీల్‌సాబ్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్గా వ‌స్తోంది. ఇర‌వై రోజుల షెడ్యూల్ కూడా ఫినిష్ అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అయిన‌ట్టే. ఈ సినిమా షూటింగ్ ఈ నెల‌లోనే ప్రారంభించేందుకు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ స‌న్నాహాలు చేస్తున్నాడు. ఇక వ‌కీల్‌సాబ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాక‌పోయినా కూడా ఈ మూవీలో మొత్తం ఐదు పాట‌లు ఉంటాయట‌. ఇప్ప‌టికే ఆల్బ‌మ్ రెడీ అవ్వ‌డంతో పాటు బాగా వ‌చ్చింద‌ని సినిమా యూనిట్ వ‌ర్గాలు చెపుతున్నాయి.

ఈ ఐదు పాట‌ల్లో ఒక‌టి ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కాగా, మ‌రో రెండు క‌థానుసారం వ‌స్తాయ‌ట‌. ఈ విషయం పై స్పందించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ మాట్లాడుతూ నిజాయితీగా తెర‌కెక్కుతోన్న క‌థ ఇది. ఒరిజిన‌ల్ క‌థ‌లో ఎలాంటి మార్పులు చేయ‌కుండానే వ‌కీల్‌సాబ్ సినిమాను తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌, ఎడిటింగ్ డిసెంబ‌ర్‌కు కంప్లీట్ చేస్తారు. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news