Moviesబిగ్‌బాస్ హౌస్‌లో రెండు ల‌వ్ స్టోరీలు.. ఒక‌టి ట్ర‌యాంగిల్‌.. రెండోది ఎవ‌రంటే..!

బిగ్‌బాస్ హౌస్‌లో రెండు ల‌వ్ స్టోరీలు.. ఒక‌టి ట్ర‌యాంగిల్‌.. రెండోది ఎవ‌రంటే..!

తెలుగు బుల్లితెర‌పై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగో సీజన్ మెల్లగా వినోదం బాట పట్టింది. మొద‌టి వారంతో పోలిస్తే రెండో వారంలో కాస్త వినోదం పాళ్లు ఎక్కువ‌గానే ఉన్నాయి. బీబీ టీవీ అంటూ.. మరోవైపు హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు వేయిస్తున్నాడు. ఇక బిగ్‌బాస్‌లో ఉండే పులిహోర ప్రేమ క‌థ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇందులో ఒక‌టి ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ కాగా.. రెండోది ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ స్టోరీగా క‌న‌ప‌డుతోంది.

 

 

ఇక రెండో వారం ఎలిమినేష‌న్లో ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? అన్న‌ది ఆస‌క్తిగా ఉంది. ఇక హౌస్‌లో గ్లామ‌ర్‌కు త‌క్కువ లేదు. ఇప్ప‌టికే ఓ ల‌వ్ స్టోరీ ప‌ట్టాలెక్కింది. అయితే ఇది ట్ర‌యాంగిల్‌గా మార‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా హీరో అభిజిత్, హీరోయిన్ మోనాల్ మ‌ధ్య ల‌వ్ స్టోరీ ప్రారంభం కాగా… ఇప్పుడు ఇందులోకి అఖిల్ కూడా రావ‌డంతో ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ ఎటు మ‌లుపులు తిరుగుతుందా ? అన్న ఉత్సుక‌త ఉంది.

 

 

ఇక ఇప్పుడు హౌస్‌లో రెండో జంట‌ను కూడా సిద్ధం చేసే ప‌నిలో బిగ్‌బాస్ ఉన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఈ జంట దేత్త‌డి హారిక‌, దిల్ సే మ‌హ‌బూబ్ మ‌ధ్య రొమాన్స్ పుట్టిస్తాడ‌ని తెలుస్తోంది. ఇక ముక్కు అవినాష్ వచ్చాడు కాబట్టి కామెడీ స్కిట్లతో షో నడిపించే అవకాశం కనిపిస్తోంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news