Newsక‌రీంన‌గ‌ర్ రోడ్ల‌పై టాప్ క‌మెడియ‌న్ భిక్షాట‌న‌.. రీజ‌న్ తెలిస్తే షాకే

క‌రీంన‌గ‌ర్ రోడ్ల‌పై టాప్ క‌మెడియ‌న్ భిక్షాట‌న‌.. రీజ‌న్ తెలిస్తే షాకే

తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ రోడ్ల‌పై టాలీవుడ్ క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ భిక్షాట‌న చేస్తోన్న దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అదేంటి ష‌క‌ల‌క శంక‌ర్ ఏంటి క‌రీంన‌గ‌ర్ రోడ్ల‌పై భిక్షాట‌న చేయ‌డం ఏంట‌ని షాక్ అవ్వొద్దు.. ఇదేదో త‌న కోస‌మే లేదా ప‌బ్లిసిటీ కోస‌మే చేయ‌డం లేదు. ఓ ప‌నిమీద శంక‌ర్ క‌రీంన‌గ‌ర్ వెళ్లాడు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ పేద‌ల కోసం ఏదైనా చేయాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలోనే క‌రీంన‌గ‌ర్ పట్ట‌ణ రోడ్ల‌పై భిక్షాట‌న ప్రారంభించాడు.

 

ఇలా భిక్షాట‌న చేసి రు. 90 వేలు సంపాదించాడు. దీనికి త‌న మొత్తంగా రు. 10 వేలు క‌లిపి మొత్తం రు. ల‌క్ష‌ను క‌రోనా కార‌ణంగా ప‌ని కోల్పోయి దీన‌స్థితిలో ఉన్న కుటుంబాల‌కు అంద‌జేసి అంద‌రి చేతా శ‌భాష్ అని ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇక ఇదే క్ర‌మంలో తాను ప్ర‌తి నెలా భిక్షాట‌న చేసి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల‌కు సాయం చేస్తాన‌ని ష‌క‌ల‌క శంక‌ర్ భావిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news