Gossipsఈ వారం బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే... లెక్క తేలిపోయిందా...!

ఈ వారం బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే… లెక్క తేలిపోయిందా…!

తెలుగు బిగ్‌బాస్ 4 సీజ‌న్ రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి వారం కాస్త చ‌ప్ప‌గా సాగినా ఇప్పుడిప్పుడే షో కాస్త ర‌క్తిక‌డుతుండ‌డంతో టీఆర్పీలు కూడా పెరుగుతున్నాయి. కొత్త‌గా హౌస్‌లోకి సాయి కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌లో తొలి వారం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా ఈ ప్లేసులో సాయికిర‌ణ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక రెండో వారం ఎలిమినేష‌న్లో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా 9 మంది ఉన్నారు.

 

రెండో వారం ఎలిమినేష‌న్లో ఉన్న‌వారిలో ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందంగా ఎలిమినేష‌న్లో ఉండే ఛాన్స్ ఇచ్చే టాస్క్ బిగ్‌బాస్ ఇచ్చాడు. ఓ ప‌డ‌వ ఇచ్చి ఆ ప‌డ‌వ ఆగిన‌ప్పుడు అల్లా దిగిపోయే వారే ఎలిమినేష‌న్లో ఉంటార‌ని చెప్ప‌డంతో ఈ సారి బ‌య‌ట‌ప‌డ‌తాం అనుకున్న వారు అంద‌రూ ధైర్యంగా కింద‌కు దిగి స్వ‌చ్ఛందంగా నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేష‌న్లో ఉన్న వారిని చూస్తే గంగ‌వ్వ‌, అభిజిత్, సోయెల్, కరాటే కళ్యాణి, దేత్తడి హారిక వంటి వారు ఉన్నారు.

 

అయితే ఈ సారి ఎలిమినేష‌న్లో ఉన్న వారిలో క‌రాటే క‌ల్యాణి వీక్ క్యాండెట్ అన్న చ‌ర్చ న‌డుస్తోంది. వాస్త‌వంగా ఆమె తొలి వారం ఎలిమినేష‌న్లో ఉండి ఉంటే సూర్య కిర‌ణే సేవ్ అయ్యేవాడ‌ని.. అలా క‌రాటే క‌ల్యాణి సేఫ్ అయ్యింద‌ని.. రెండో వీకెండ్‌లో ఆమే ఖ‌చ్చితంగా హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళుతుంద‌ని ఎక్కువ మంది అంటున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఎలాగూ నామినేష‌న్లో ఉంది కాబ‌ట్టి ఆమె సేఫ్ అవ్వాలంటే పెద్ద సంచ‌ల‌న‌మే జ‌ర‌గాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news