Sportsస్టార్ క్రికెట‌ర్ స్మృతి మందాన‌ భాయ్‌ఫ్రెండ్‌కు అమితాబ్‌కు లింక్ ఇదే...!

స్టార్ క్రికెట‌ర్ స్మృతి మందాన‌ భాయ్‌ఫ్రెండ్‌కు అమితాబ్‌కు లింక్ ఇదే…!

భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన చాలా త‌క్కువ టైంలోనే తిరుగులేని స్టార్ బ్యాట్స్‌మెన్ అయిపోయింది. పురుషుల క్రికెట్లో కోహ్లీ ఎంత స్టారో మ‌హిళ‌ల క్రికెట్లో స్మృతి మందాన అంత స్టార్ అయిపోయింది. 2013 లో వన్డే, 2014 లో టెస్ట్ అరంగేట్రం చేసిన 24 ఏళ్ల ఈ భారత బ్యాట్స్‌మెన్ తక్కువ టైంలోనే 2016 ఐసీసీ ఉమెన్స్ టీం ఆప్ ది ఇయ‌ర్‌లో చోటు ద‌క్కించుకుని అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇక ఆమె ఆట‌తో పాటు ఆమె న‌వ్వుకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

 

అందుకే భార‌త క్రికెట్ అభిమానులు ఆమెను బ్యాటింగ్ సుంద‌రి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఈ సుంద‌రికి ఓ భాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడ‌ట‌. మధ్యప్రదేశ్ కు చెందిన పలాష్ ముచ్చల్ అనే మ్యూజిక్ డైరెక్టర్ తో స్మృతి ప్రేమలో ఉన్నట్లు టాక్‌. ప‌లాస్ అమితాబ్ భూత్నాథ్ రిటర్న్స్ సినిమాకు కూడా ఇతనే మ్యూజిక్ అందించాడు.

 

అయితే స్మృతి ఈ విష‌యాన్ని సీక్రెట్‌గా దాస్తోంద‌ట‌. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అతడి గురించి అడిగితే అత‌డు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించింది ? ఇక అంత‌కుముందే అత‌డి కొత్త పాట అప్‌డేట్ స్మృతి స్వ‌యంగా ఇచ్చింది. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అనే అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news