Moviesసైనా నెహ్వాల్ బ‌యోపిక్‌.. భ‌యం వేస్తోందంటున్న క్రేజీ హీరోయిన్‌

సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌.. భ‌యం వేస్తోందంటున్న క్రేజీ హీరోయిన్‌

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అన్ని ఇండ‌స్ట్రీల‌లో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. ప్రేక్ష‌కులు కూడా బ‌యోపిక్‌ల‌పై ఆస‌క్తి చూపిస్తుండ‌డంతో సినిమా మేక‌ర్స్ కూడా వీటిని తీసేందుకు ఎక్కువ ఆస‌క్తితో ఉన్నారు. అన్ని రంగాల్లో ప్ర‌ముఖులు అయిన వారి జీవిత క‌థ‌ల‌ను తీసుకుని సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల జీవితాలు బ‌యోపిక్‌లుగా తెర‌కెక్కాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ కూడా తెర‌కెక్కుతోంది.

ఈ బ‌యోపిక్‌లో సైనాగా ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్‌ పరిణీతి చోప్రా నటిస్తుంది. ఈ సినిమాకి అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సీరిస్ బ్యాన‌ర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం ప‌రిణితి సైనాగా క‌నిపించేందుకు క‌ఠోర శిక్ష‌ణ తీసుకుంటోంది.

 

 

ఈ రోల్ చేయ‌డంపై ప‌రిణితి మాట్లాడుతూ ఈ పాత్ర చేయ‌డం అంటేనే ఎందుకో భ‌యంగా ఉంద‌ని… అంత గొప్ప స్టార్ ప్లేయర్ రోల్లో చేస్తోంది అంటేనే కొంచెం టెన్ష‌న్‌గా ఉంద‌ని చెపుతోంది. ఏదేమైనా సైనా పాత్రకి పూర్తి న్యాయం చేస్తాను అని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news