క‌రోనాతో టీడీపీ కీల‌క నేత మృతి… విషాదంలో పార్టీ శ్రేణులు

ఏపీలో క‌రోనా రోజు రోజుకు త‌న విశ్వ‌రూపం చూపిస్తోంది. క‌రోనా దెబ్బ‌తో ప‌లువురు నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చ‌నిపోతున్నారు.  ఈ క్ర‌మంలోనే క‌రోనా ఓ టీడీపీ కీల‌క నేత‌ను బ‌లి తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. గ‌త ప‌ది రోజులుగా ఆయ‌న క‌రోనాతో విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

అప్ప‌టి నుంచి చికిత్స పొందుతున్నా ఆయ‌న‌కు క‌రోనా త‌గ్గ‌లేదు. ఈ రోజు ఉద‌యం ఐదు గంట‌ల‌కు ఆయ‌న మృతి చెందారు. ఆయ‌న స్వ‌స్థ‌లం కృష్ణా జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. ఈయ‌న మృతితో టీడీపీ శ్రేణులు విషాదంలో కూరుకుపోయాయి. ఆయ‌న వివాద‌ర‌హితుడిగా పేరు తెచ్చుకున్నారు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమా,కొల్లు రవీంద్రలు సంతాపం వ్య‌క్తం చేశారు.