Gossipsస్టార్ మా కొత్త రియాలిటీ షోలో తార‌క్‌.. టీఆర్పీలు బ్రేక్ అయ్యేలా..!

స్టార్ మా కొత్త రియాలిటీ షోలో తార‌క్‌.. టీఆర్పీలు బ్రేక్ అయ్యేలా..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్త‌తం వ‌రుస పెట్టి సినిమాలు ప‌ట్టాలెక్కించేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత మాట‌ల మంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా ఆ వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఇలా వ‌రుస‌పెట్టి క్రేజీ ప్రాజెక్టుల‌ను ప‌ట్టాలెక్కిస్తోన్న తార‌క్ త్వ‌ర‌లోనే మ‌రో రియాలిటీ షోను హోస్ట్ చేసేందుకు రెడీ అవుతోన్న‌ట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బుల్లితెర‌పై హోస్ట్ చేసిన బిగ్‌బాస్ రియాల్టీ షో ఎలా దుమ్ము రేపిందో.. టీఆర్పీల్లో ఏ రేంజ్‌లో రికార్డులు బ్రేక్ చేసిందో చూశాం.

9 Interesting Things About Jr NTR That Every Fan of His Must Know -  BookMyShow

తొలి బిగ్‌బాస్ సీజ‌న్‌కు వ‌చ్చినంత టీఆర్పీ త‌ర్వాత ఏ సీజ‌న్‌లోనూ రాలేదు. ఇప్పుడు న‌డుస్తోన్న సీజ‌న్ సైతం చ‌ప్ప‌గా ఉండ‌డంతో టీఆర్పీలు తుస్సుమంటున్నాయి. స్టార్ మా లాక్‌డౌన్ టైంలో ఈ షో అదిరిపోయే టీఆర్పీలు తీసుకు వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకుంది. అవ‌న్నీ ఫెయిల్ అవ్వ‌డంతో ఇప్పుడు హౌస్‌లో కంటెస్టెంట్ల విష‌యంలో కాస్త మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది. కాస్త ఫేమ‌స్ అయిన మ‌రో ముగ్గురు కంటెస్టెంట్ల‌ను లోప‌ల‌కు పంపాల‌ని చూస్తోంది.

Happy Birthday Jr NTR: Here are Some Lesser-Known Facts About the Actor

ఈ షో పూర్త‌యిన వెంట‌నే తారక్ హోస్ట్‌గా మ‌రో షో ప్లాన్ చేస్తోంద‌ని అంటున్నారు. ఈ షో ఎలా ఉంటుంది ? అన్న‌ది క్లారిటీ లేక‌పోయినా తెలుగు బుల్లితెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఏ షో రాని విధంగా ప్లాన్ చేస్తున్నార‌ని.. ఇందుకోసం తార‌క్‌కు భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. గ‌తంలో బిగ్‌బాస్ హోస్ట్ చేసిన‌ప్పుడే తార‌క్‌కు ఎపిసోడ్‌కు రు. కోటి ఇచ్చార‌న్న టాక్ ఉంది. ఈ సారి అంత‌కు మించిన రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌‌ట‌. సంక్రాంతి త‌ర్వాత ఇది ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news