పార్ల‌మెంటులో బ్లూ ఫిల్మ్ చూస్తూ బుక్ అయిన ఎంపీ… కామెడీ ఆన్స‌ర్

పార్ల‌మెంటుల్లోనూ, అసెంబ్లీల్లోనూ బ్లూ ఫిల్మ్‌లు చూస్తూ బుక్ అయిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను మ‌న దేశంలోనే చూశాం. క‌ర్నాట‌క‌లో కొంద‌రు ఎమ్మెల్యేలు గ‌తంలో ఇదే ప‌ని అసెంబ్లీలో చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. తాజాగా పార్ల‌మెంటు సాక్షిగా ఆర్థిక‌మంత్రి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతుంటే ఓ ఎంపీ బ్లూ ఫిల్మ్ చూస్తూ కెమేరాకు బుక్ అయ్యాడు. థాయ్‌లాండ్ పార్ల‌మెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చ‌దువుతుంటే అధికార పార్టీ ఎంపీ రోన్నతెప్ అనువాత్ నీలి చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేశారు.

అయితే మీడియా గ్యాల‌రీలో ఉన్న విలేక‌రులు ఈ దృశ్యం చూడ‌డంతో పాటు త‌మ కెమేరాల్లో బంధించారు. ప‌ది నిమిషాల పాటు ఆయ‌న ఈ వీడియోల్లో నిమ‌గ్న‌మైపోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఆయ‌న తాను ఆ చిత్రాలు చూశాన‌ని విలేక‌ర్ల ముందు కూడా ఒప్పుకున్నారు. అయితే దానికి ఆయ‌న చెప్పిన కార‌ణం మాత్రం కామెడీగా ఉంది. ఆ చిత్రాల్లో ఓ మ‌హిళ సాయం చేయాల‌ని అర్థిస్తోంద‌ని.. అది నిజ‌మా ? కాదా ? అని తెలుసుకునేందుకే తాను వాటిని చూశాన‌ని చెప్పారు.

Thai Parliament Prepares to Elect First Woman Prime Minister | Voice of  America - English

ఆమె చుట్టూ ఉన్న కొంద‌రు గ్యాంగ్‌స్ట‌ర్లు వేధిస్తుండ‌డంతో ఆమె ఏమైనా ప్ర‌మాదంలో ఉందా ? అని ప‌రిశీలించేందుకే వాటిని గ‌మ‌నించాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ఆ ఫొటోల‌ను త‌న ఫోన్ నుంచి డిలీట్ చేశాన‌ని కూడా చెప్పారు.

Leave a comment