Newsస్కూల్ వాట్సాప్ గ్రూపులో సెక్స్ వీడియోలు.. లేడీ టీచ‌ర్ ఫొటోలు

స్కూల్ వాట్సాప్ గ్రూపులో సెక్స్ వీడియోలు.. లేడీ టీచ‌ర్ ఫొటోలు

ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ అన్ని మూత‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. కొంద‌రు విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసుల‌ను సాకుగా తీసుకుని ఫోన్ల‌ను చెత్త ప‌నుల‌కు వాడుతున్నారు. ఇటీవ‌ల స్కూల్‌వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని భాగ‌వ‌త్ ప‌ట్ట‌ణంలో ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోలు ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఓ విద్యార్థి ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫోన్ నెంబ‌ర్‌తో బ‌యాల‌జీ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అశ్లీల వీడియోల‌తో పాటు బ‌యాల‌జీ టీచ‌ర్ ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. ఈ ఫొటో కింద ప‌లువురు స్టూడెంట్స్ వ‌ర‌స్ట్ కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోల కింద మ‌రి కొంద‌రు విద్యార్థులు అశ్లీలంగా చాటింగ్ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ఓ విద్యార్థి స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు సైబ‌ర్ క్రైం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news