Moviesసంజ‌న‌, రాగిణికి కోట్ల ఆస్తులు.. విచార‌ణ‌లో క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలివే

సంజ‌న‌, రాగిణికి కోట్ల ఆస్తులు.. విచార‌ణ‌లో క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలివే

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్స్ విచార‌ణ‌లో ఈడీ అధికారుల విచార‌ణ‌లో క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్పటికే పోలీసుల విచారణలో ఉన్న శాండ‌ల్‌వుడ్ హాటీ హీరోయిన్లు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీ ఆస్తులు గురించి షాకింగ్ నిజాలు వెల్ల‌డి అవుతున్నాయి. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న‌ట్టు కూడా గుర్తించార‌ని అంటున్నారు.

రాగిణి ద్వివేదీ కేపీఎల్‌ బళ్లారి టీమ్‌లో భాగస్వామి. ఇక మ‌రో హీరోయిన్ సంజ‌న పృథ్వీశెట్టితో కలిసి బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఈడీ అధికారులకు స‌మాచారం అందింద‌ట‌. వాస్త‌వంగా చూస్తే ఈ ఇద్ద‌రు హీరోయిన్లు అంత గొప్ప హీరోయిన్లు కాదు.. పెద్ద‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు లేవు.. స్టార్ హీరోల‌తో ఒక‌టీ ఆరా త‌ప్పా చేసిన సినిమాలు లేవు.

అయితే వీరికి ఇంత ఆస్తులు ఎలా ? వ‌చ్చాయ‌న్న‌ది మాత్రం అంతుప‌ట్ట‌డం లేదు. ఇక ఈ కేసులో అరెస్టు హీరోయిన్ల‌తో పాటు మిగిలిన నిందితుల‌కు కేరళకు చెందిన బంగారు స్మగ్లర్‌ ముఠాతో సంబంధాలున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు… వీరిని విచారించేందుకు ప్ర‌త్యేక కోర్టు నుంచి కూడా అనుమ‌తి పొందారు. ఇక‌ సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదికి ఉన్న ఆస్తుల వ్యవహారాలపై మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news