Moviesబాలీవుడ్‌లో రియా బిగ్ బాంబ్‌... డ్ర‌గ్ ఎడిక్ట్ న‌టీన‌టుల పేర్లు చెప్పేసింది..

బాలీవుడ్‌లో రియా బిగ్ బాంబ్‌… డ్ర‌గ్ ఎడిక్ట్ న‌టీన‌టుల పేర్లు చెప్పేసింది..

సుశాంత్‌ మృతితో వెలుగు చూసిన డ్రగ్‌ కేసులో ఎన్‌సీబీ అధికారులు ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డిస్తున్నారు. ఇప్ప‌టికే కార్టెల్ ఎ, బి, సి కేటగిరీలకు సంబంధించిన 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్ల‌ను కూడా వీరు సిద్ధం చేసుకున్నారు. ఈ లిస్టులో సుశాంత్ కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా ఉన్న రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఆమె సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి విచార‌ణ‌లో ప‌లువురు పేర్లు వెల్ల‌డించిన‌ట్టు అధికారులు చెపుతున్నారు. ఇక ఈ కేసులో అధికారులు రియా, షోవిక్ ఇద్ద‌రిని అరెస్టు చేశారు.

ఇక తాను డ్ర‌గ్స్ తీసుకోన‌ని.. సిగ‌రెట్ మాత్ర‌మే తాగుతాన‌ని.. అయితే ఓ సినిమా పాత్ర కోసం డ్రగ్స్‌ తీసుకున్నట్లు అధికారుల‌కు చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఆమె బాలీవుడ్‌లో పలువురికి డ్ర‌గ్స్‌తో లింకులు ఉన్నాయ‌ని చెప్ప‌డంతో పాటు వారి పేర్లు కూడా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో డ్ర‌గ్స్ వాడే న‌టీన‌టుల‌తో పాటు ఏ పార్టీల్లో డ్ర‌గ్స్ వాడ‌తారో కూడా ఆమె చెప్పింద‌ట‌.

రియా చెప్పిన డేటా ఆధారంగా పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్‌సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన రియా సోదరుడు షోవిక్‌, సుశాంత్‌ హౌజ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, నటుడు కుక్‌ దీపెష్‌ సావంత్‌లను పోలీసులు  సెప్టెంబ‌ర్ 9న కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. ఏదేమైనా రియా కొంద‌రు న‌టీన‌టుల పేర్లు చెప్ప‌డంతో ఇప్పుడు బాలీవుడ్  ఉలిక్కి ప‌డుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news