Gossipsనాతో ఉంటావా... నీ సిస్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు పోతావా... సుశాంత్‌ను బ్లాక్ మెయిల్...

నాతో ఉంటావా… నీ సిస్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు పోతావా… సుశాంత్‌ను బ్లాక్ మెయిల్ చేసిన రియా..!

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత ఈ కేసులో రోజుకో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సీబీఐ సుశాంత్ ప్రియురాలు రియా చక్ర‌వ‌ర్తితో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు , రియా తండ్రితో పాటు సుశాంత్ ప‌ర్స‌న‌ల్ మేనేజర్‌, హౌస్ కీపింగ్ మేనేజ‌ర్ల‌ను విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సీబీఐ విచార‌ణ‌లు ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

రియానే సుశాంత్‌ను ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపించింద‌న్న అనుమానాలు సీబీఐ వ్య‌క్తం చేస్తోంది. సుశాంత్‌ను ప‌లుమార్లు బెదిరించి అత‌డితో భారీగ ఆమె ఖ‌ర్చు పెట్టించ‌డంతో పాటు త‌న కోసం ఏకంగా రు. 15 కోట్లు వ‌ర‌కు తీసుకున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ఒకానొక ద‌శ‌లో సుశాంత్ తీవ్ర ఒత్తిడితో త‌న సోద‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా సుశాంత్ సోద‌రికి ద‌గ్గ‌ర‌య్యేందుకు ఇష్టంలేని రియా.. నాతో ఉంటావో నీ సిస్ట‌ర్ ద‌గ్గ‌ర‌కే పోతావో తేల్చుకో అని బెదిరించింద‌ట‌.

చివ‌ర‌కు అనేక విధాలుగా రియా సుశాంత్‌ను బ్లాక్ మెయిల్ చేసింద‌న్న ఆధారాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని టాక్‌. చివ‌ర‌కు త‌న మేనేజ‌ర్ దిశ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత సుశాంత్ మ‌రింత‌గా డ్ర‌గ్స్‌కు బానిస అయ్యాడ‌ని తెలుస్తోంది. రియా ద్వారానే సుశాంత్‌కు డ్ర‌గ్స్ వెళ్లాయ‌న్న ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయంటున్నారు. ఏదేమైనా రోజు రోజుకు రియా చుట్టూ గ‌ట్టి ఉచ్చే బిగుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news