Moviesబిగ్ బ్రేకింగ్‌: రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్టు... ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు రాన‌న్ని కేసులు

బిగ్ బ్రేకింగ్‌: రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్టు… ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు రాన‌న్ని కేసులు

దివంత బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిపై అనేక సందేహాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అటు సుశాంత్ అభిమానులు, కుటుంబ స‌భ్యులు సైతం రియాపై అనేక సందేహాలు వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే ఆమెను గ‌త కొంత కాలంగా సీబీఐ అధికారుల‌తో పాటు నార్కోటిక్స్ పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఈ విచార‌ణ‌లో సుశాంత్ మృతిపై అనేక కొత్త అనుమానాలు కూడా వెలుగు చూశాయి.

డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెపై కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు అరెస్టు చేశారు. ఈ సెక్ష‌న్ల‌ను చూస్తుంటే ఆమె ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు కూడా లేవ‌ని తెలుస్తోంది. ఆమె ఆమె ఎక్క‌డెక్క‌డ డ్ర‌గ్స్ దాచిందో దాని రిక‌వ‌రీ కోసం ఆమెను వివిధ ప్రాంతాల‌కు కూడా ఎన్‌సీబీ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇప్ప‌టికే నార్కోటిక్స్ పోలీసులు ఈ కేసులో రియా సోదరుడు శౌవిక్‌తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ కూడా ఎన్‌సీబీ ఆధీనంలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో గత నాలుగు రోజుల నుంచి రియాను ఎన్‌సీబీ విచారించింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news