Gossipsఆ హీరోతో మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు నాని రెడీ... కేక పెట్టించే కాంబినేష‌న్‌..!

ఆ హీరోతో మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు నాని రెడీ… కేక పెట్టించే కాంబినేష‌న్‌..!

నేచుర‌ట్ స్టార్ నాని – సుధీర్‌బాబు న‌టించిన వి సినిమా ఇటీవ‌ల అమోజాన్ ప్రైమ్‌లో డిజిట‌ల్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్ప‌టికే మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చేసింది. ఈ సినిమా త‌ర్వాత నాని వ‌రుస‌గా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీశ్ సినిమా చేస్తోన్న నాని ఆ త‌ర్వాత సితార ఎంట‌ర్టైన్‌మెంట్ వాళ్లు నిర్మించే సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకు టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం వ‌హిస్తారు.

SEE PICS: Rana Daggubati, Nani, Lakshmi snapped at IIFA Utsavam | IndiaToday

ఈ సినిమాకు ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ అనే టైటిల్ పెట్టారు. ఇదిలా ఉంటే నాని తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు రెడీ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. రానా – నాని కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్‌కు సురేష్ ప్రొడ‌క్ష‌న్ స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. ఇందుకు ఇప్ప‌టికే అగ్ర నిర్మాత సురేష్‌బాబు స‌న్నాహాలు మొద‌లు పెట్టేశాడ‌ని అంటున్నారు.

Nani completes 11 years in Tollywood; here's how he made it big in the  showbiz | Telugu Movie News - Times of India

నాని ఇప్ప‌టికే అష్టాచమ్మా – రైడ్ – ఎవడే సుబ్రహ్మణ్యం – నిన్ను కోరి – దేవదాస్ మొదలైన మల్టీస్టారర్ చిత్రాల్లో నటించాడు నాని. తన కెరీర్లో 25వ సినిమాను కూడా సుధీర్‌బాబుతో క‌లిసి మ‌ల్టీస్టార‌రే చేశాడు. మ‌రి వి రిజ‌ల్ట్ త‌ర్వాత రానాతో మ‌ల్టీస్టార‌ర్‌కు నాని ఓకే చెపుతాడో ? లేదో ? చూడాలి. ఏదేమైనా వీరిద్ద‌రు క‌లిసి నటిస్తే అది కెవ్వు కేక పెట్టించే సినియామే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news